Moviesసుకుమార్ జుట్టు రష్మిక చేతిలో..అయ్యయ్యో ఒక్క వీడియోతో అడ్డంగా దొరికిపోయాడే..!?

సుకుమార్ జుట్టు రష్మిక చేతిలో..అయ్యయ్యో ఒక్క వీడియోతో అడ్డంగా దొరికిపోయాడే..!?

హ..హ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నవ్వుకోవడానికి చిత్రంగా ఉన్న ఇదే నిజం అంటున్నారు పుష్ప సినిమా మేకర్స్. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ సుకుమార్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో. మరీ ముఖ్యంగా బన్నీ సుకుమార్ కాంబోలో సినిమా వస్తుందంటేనే అభిమానులకి స్పెషల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని ఏమాత్రం తీసిపోకుండా దానికి డబుల్ బజ్ ని క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ముందుకు వెళుతూ ఉంటాడు సుకుమార్.

రీసెంట్గా సుకుమార్ బన్నీ తో తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప2. పుష్పవన్ రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది . ఈ క్రమంలోనే పుష్ప2 పై కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు. కాగా ప్రజెంట్ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సినిమా షూట్ పూర్తి అయిన తర్వాత చిల్ అవుట్ అవుతున్న సుకుమార్ బన్నీతో రష్మిక జరిపిన ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది .

ఈ క్రమంలోనే సుకుమార్ తనతో వర్క్ చేసే హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ ను ఓ వీడియో రూపంలో రష్మిక మందన తన మొబైల్ లో బంధించిందట . అంతేకాదు ఈ వీడియోని పట్టుకొని ఇప్పుడు రష్మిక సరదాగా సుకుమార్ ని ఆట పట్టిస్తుందట. నెక్స్ట్ సినిమాలో నాకు అవకాశం ఇస్తే ఈ వీడియోని లీక్ చేయను లేకపోతే లీక్ చేసేస్తాను అంటూ సుకుమార్ ను సరదాగా ఆటపట్టిస్తుందట . ఈ క్రమంలోని సుకుమార్ జుట్టు రష్మిక చేతిలో ఉంది అంటూ ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news