Moviesఅఖిల్ ' ఏజెంట్‌ ' కు సెన్సార్ షాక్‌… సినిమా అంతా...

అఖిల్ ‘ ఏజెంట్‌ ‘ కు సెన్సార్ షాక్‌… సినిమా అంతా పేద్ద‌ క‌న్‌ఫ్యూజ్‌…!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్‌ మార్కెట్‌ను మించి రు. 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరికెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. అలాగే మళ‌యాళ స్టార్ ముమ్ముట్టి కీలకపాత్రలో కనిపిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై అగ్ర నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు.

దాదాపు రెండున్నర సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే సెన్సార్ బోర్డు సభ్యులు ఏజెంట్ సినిమాకు యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే ఓ అదిరిపోయే షాక్ కూడా ఇచ్చారు. సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉందట‌.. హెవీ బ్లడ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. సెన్సార్ ఏకంగా ఎనిమిది కట్స్‌ సూచించినట్టు తెలుస్తుంది. పలు కీలక డైలాగులతో పాటు సీన్ల‌ను కూడా మ్యూట్‌ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది.

నిర్భయ పీఎం అనే పదంతో పాటు కొన్ని స‌బ్‌టైటిల్స్‌, బ్యాగ్రౌండ్ విజువల్స్ విషయంలో అభ్యంతరాలు వ‌చ్చాయ‌ట‌. ఇక హీరో పేస్ బాడీపై హెవీగా బ్లడ్ ఉండ‌డం, చూతే మార్ చూద్ ఫకింగ్ లాంటి డైలాగ్స్ మ్యూట్ చేయాల‌ని చెప్పింద‌ట‌. ఓవ‌రాల్‌గా మూడు నిమిషాల నిడివి వ‌ర‌కు సెన్సార్ అభ్యంత‌రం చెప్పిన‌ట్టు తెలుస్తోంది. సినిమా కొంత క‌న్‌ఫ్యూజింగ్‌గా కూడా ఉంద‌ని అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డినా ప్ర‌మోష‌న్ల విష‌యంలో అనుకున్న‌ట్టుగా బ‌జ్ క్రియేట్ చేయ‌లేదు.

ఇక ముందు నుంచి అఖిల్ ఏజెంట్ కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డా అంత హైప్ రాలేదు. అస‌లు అనుకున్న డేట్‌కు రిలీజ్ అవుతుందా ? అన్న సందేహాలు కూడా క‌లిగాయి. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇక ఏజెంట్‌ ఏకంగా 156 నిమిషాల రన్ టైఎం ఉందంట. ఇటీవ‌ల కాలంలో ఇంత‌ ఎక్కువ రన్ టైమ్ తో తెలుగు నుంచి వస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news