Movies"అవును..అది నిజమే..ఆ డైరెక్టర్ తోరిలేషన్ లో ఉన్నా.. దుప్పటి కూడా కప్పుతా".....

“అవును..అది నిజమే..ఆ డైరెక్టర్ తోరిలేషన్ లో ఉన్నా.. దుప్పటి కూడా కప్పుతా”.. డీజే టిల్లు హీరో తేడాగాడా ఏంటి..?

సీనియర్ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డిజె టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. కుర్ర హీరోలలో సిద్దు ఈ సినిమాతో తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. చిన్న సినిమాగా విడుదలైన డీజే టిల్లు సిద్దు కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ రాబోతుంది. డీజే టిల్లు స్క్వేర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ ఈ సినిమా చుట్టూ నడుస్తోంది. ముందుగా ఈ సీక్వెల్ సినిమా నుంచి డైరెక్టర్ విమల కృష్ణ తప్పుకున్నాడు.

ఆ తర్వాత హీరోయిన్ల విషయంలో చాలా పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరకు అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం షూటింగ్ సెట్లో సిద్దుకి.. అనుపమకి గొడవ జరగడంతో ఆమె కూడా షూటింగ్ వాకౌట్ చేసి వెళ్లిపోయినట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై సిద్దు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన సినిమాపై జరుగుతున్న వివాదాలకు క్లారిటీ ఇచ్చారు.

తన సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.. నిజానికి మేము ఈ సినిమాకు ముందుగా హీరోయిన్ గా అనుపమనే తీసుకోవాలని అనుకున్నామని చెప్పాడు. ఇక డైరెక్టర్ విమల కృష్ణతో గొడవపై స్పందిస్తూ లైవ్ లోనే అతడికి కాల్ చేశాడు. తమ మధ్య ఎలాంటి ?విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. డిజె టిల్లు స్క్వేర్ సినిమా డైరెక్టర్ చేస్తున్న మాలిక్ రామ్‌తో తాను రిలేషన్ లో ఉన్నానని.. అతడు మా ఇంట్లోనే ఉంటాడు.. మా ఇంట్లోనే తింటాడు.. అతడు పడుకుంటే దుప్పటి కూడా నేనే క‌ప్పుతాను… అత‌డితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా అని చెప్పుకొచ్చాడు.

ఇక కృష్ణ అండ్ హిజ్ లీల డైరెక్టర్‌కు అయితే ముద్దు కూడా పెట్టాను అని సిద్దు సరదాగా చెప్పాడు. సిద్దు ఎలా చెప్పినా ? సిద్దు మగాడు.. అయినా డైరెక్టర్ తో రిలేషన్ తో ఉండటం ఏంటి ? ఏమైనా తేడాగాడా అని సోషల్ మీడియాలో కొందరు సరదాగా కామెంట్లతో మనోడిని ఆట‌ పట్టిస్తున్నారు. ఏది ఏమైనా సిద్దు యూత్లో మంచి క్రేజ్ ఏర్పరచుకున్నది వాస్తవం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news