Moviesగ‌ర్ల్‌ఫ్రెండ్ గోవిందా… అఖిల్ అక్కినేనికి మ‌ళ్లీ బ్రేక‌ప్‌.. ( వీడియో )..!!

గ‌ర్ల్‌ఫ్రెండ్ గోవిందా… అఖిల్ అక్కినేనికి మ‌ళ్లీ బ్రేక‌ప్‌.. ( వీడియో )..!!

అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ సరైన హీరోగా నిలదొక్కుకోలేదు. ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఈనెల 28న రిలీజ్ అవుతుంది. ఏకే ఎంటర్టైన్మెంట్ – సురేందర్ రెడ్డి 2 బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం ఈ సినిమాను నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ నెలలో ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అఖిల గురించి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.

అఖిల్‌కు తన గర్ల్ ఫ్రెండ్ తో గొడవలు వచ్చిన నేపథ్యంలో మళ్లీ బ్రేకప్ అయ్యిందట. దీంతో ఇప్పుడు అక్కినేని అభిమానులు అందరూ షాక్ లోకి వెళ్లిపోయారు. అఖిల్‌కు ఇంతకుముందే ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే మనవరాలు శ్రేయ భూపాల్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఇటలీలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరికీ మధ్య ఎక్కడో తేడా ? రావడంతో ఆ ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ అయిపోయింది.

అయితే అఖిల్ రియ‌ల్ బ్రేక‌ప్ వేరు.. ఇప్పుడు జ‌రిగింది రీల్ బ్రేక‌ప్‌. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఏజెంట్ సినిమాకు త‌మిళ హిప్ హాప్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి రామ‌కృష్ణ హ‌రి గోవింద‌… గోవింద‌.. హ‌రి గోవింద అనే లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేశారు. రామ‌పోయి కృష్ణ వ‌చ్చె…. బాధ‌పోయి హ్యాపీ వ‌చ్చిందా… గోవిందా గోవిందా గ‌ర్ల్‌ఫ్రెండ్ గోవిందా… అయ్యిందా.. అయ్యిందా బ్రేక‌ప్ అయ్యిందా.. పోయిందా.. పోయిందా ప్రేమే పోయిందా ? అనే సాంగ్ ఆక‌ట్టుకుంది.

ఈ సాంగ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన అఖిల్ సినిమాతో అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కొడ‌తార‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాకు రు. 80 కోట్ల బ‌డ్జెట్ అయ్యింది. ఇక సైరా త‌ర్వాత సురేంద‌ర్‌రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా ఇదే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news