Movies"అవి చిన్నగా ఉన్నాయి .. పెద్దగా పెంచుకో అన్నాడు".. పచ్చిగా చెప్పేసిన...

“అవి చిన్నగా ఉన్నాయి .. పెద్దగా పెంచుకో అన్నాడు”.. పచ్చిగా చెప్పేసిన రాధిక ఆప్తే..!!

రాధిక ఆప్టే మంచి నటి మాత్రమే కాదు.. ఎలాంటి విషయం అయినా బోల్డ్‌గా మాట్లాడేస్తూ ఉంటుంది. తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా నిర్భయంగా వ్యక్తం చేస్తూ ఉంటుంది. అందుకే రాధిక సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇండస్ట్రీలో ఎవరికి తెలియని విషయాలను కూడా రాధిక ధైర్యంగా బయట పెడుతున్న పరిస్థితి. కెరీర్‌ ప్రారంభంలోనే తాను బాడి షేమింగ్‌కు గురయ్యానని రాధిక ఆప్టే ఎన్నోసార్లు తెలిపింది. అలాగే కాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఆమె కొందరు స్టార్ నటులు, డైరెక్టర్ల పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇక టాలీవుడ్ లో ఒక నటుడు కూడా తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడంటూ రాధిక సంచలనం రేపింది. ఆమె తెలుగులో సూర్య హీరోగా చేసిన‌ రక్త చరిత్ర సినిమాతో పాటు బాలయ్యకు జోడిగా లెజెండ్ – ల‌య‌న్‌ సినిమాలలో వరుసగా నటించింది. అయితే ఏ హీరో తనను ఇబ్బంది పెట్టాడు అన్న విషయం మాత్రం రాధిక చెప్పలేదు. ఇక కెరీర్ ప్రారంభంలో తనను కొందరు వేధించారని చెప్పిన రాధిక.. ఒక డైరెక్టర్ అయితే ముక్కును సరిచేయమని.. తన బ్రెస్ట్ సైజు పెంచుకోవాలని సూచనలు ఇచ్చాడని సంచలన విషయం బయట పెట్టింది.

ఇక కెరీర్ ప్రారంభంలో ఎక్కువ బరువు కారణంగా ఒక సినిమా నుంచి తను తప్పుకోవాల్సి వచ్చిందని.. కేవలం 3 – 4 కిలోల బరువు పెరగటం వల్ల ఆ సినిమాలో హీరోయిన్ అవకాశాన్ని కోల్పోయానని రాధిక తెలిపింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొందరు తన బాడీపై రకరకాల కామెంట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వారు తన బ్రెస్ట్ సైజు పెంచుకోవాలని సూచనలు చేసినట్టు కూడా రాధిక తెలిపింది.

సినిమా రంగంలో సక్సెస్ కావాలన్నా.. ఛాన్సులు దక్కించుకోవాలన్నా ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉంటాయని రాధిక స్పష్టం చేసింది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సహజంగా అయినా నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని.. అయితే కావాలని ఎక్స్‌పోజింగ్ చేసేందుకు తాను ఇష్టపడనని రాధిక స్పష్టం చేసింది. ఇక మరో సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజకుంద్రా పోర్న్ వీడియోల కేసులో రాధిక అరెస్టు అయింది.

రాజ్‌కుంద్రాకు రాధికకు ఎలాంటి లింకులేకున్నా సోషల్ మీడియాలో మాత్రం భాయ్ కాట్ రాధిక ఆప్టే అన్న హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అయింది. రాధిక చాలా సినిమాల‌లో న్యూడ్ సీన్స్, బోల్డ్‌ సీన్స్ తో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది కూడా..! భారతీయ సంస్కృతిని బ్రష్టు పట్టిస్తున్న ఆమె సినిమాల్ని భాయ్‌కాట్‌ చేయాలంటూ అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news