Moviesలుంగి కట్టి.. కళ్లకు అద్దాలు పెట్టి.. ఓరి నాయనో బాలయ్య ఊర...

లుంగి కట్టి.. కళ్లకు అద్దాలు పెట్టి.. ఓరి నాయనో బాలయ్య ఊర నాటుగా తయారైయాడే..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతుంది . హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది . ఇప్పటివరకు మనం ఎన్నో సినిమాల్లో చూసిన బాలయ్య ను చూపించకుండా ..కొత్త గెటప్ లో చూపించబోతున్నారట. ఇప్పటి వరకు రిలీజ్ అయిన లుక్స్ ఆధారంగా కూడా అదే విషయం కన్ఫర్మ్ అవుతుంది.

కాగా తాజాగా ఫిలింనగర్ అప్డేట్ ప్రకారం బాలకృష్ణ నటించిన ఊర మాస్ నాటు సాంగ్ ని షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. భారీ సెట్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ కి శేఖర్ కమ్ముల కొరియోగ్రఫీ చేయడంతో .. సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ పాటలో బాలయ్య తన లోని మాస్ హీరోని బయటపెట్టినట్లు మేకర్స్ చెప్పుతున్నారు. చాలా క్లిష్టమైన స్టెప్స్ కూడా ఆలవోకగా వేసేసాడు.

కచ్చితంగా ఈ సాంగ్ థియేటర్స్ లో వస్తున్నప్పుడు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . అంతేకాదు అనిల్ రావిపూడి ఇప్పుడు షేర్ చేసుకున్న ఫోటోలోని సెట్ పిక్స్ ఆధారంగా కూడా ఇది మొత్తం ఊర నాటు మాస్ గా ఉంటుందని.. ఈ పాటలో బాలయ్య లుంగి కట్టి..మాస్ బీట్ తో దుమ్మదిలిపేసాడని తెలుస్తుంది. లైట్లతో మాస్ లుక్ తో భలే సూపర్ గా డిజైన్ చేశారు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . బాలయ్య ఎన్.బి.కె 108 సినిమా ద్వారా కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అని ఫిక్స్ అయిపోయింది . ఇక చూడాలి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య మానియా ఎలా మారిపోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news