Moviesబిగ్ బ్రేకింగ్‌: పుష్ప 2 రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..

బిగ్ బ్రేకింగ్‌: పుష్ప 2 రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 2021 డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంత పెద్ద సంచలనం క్రియేట్ చేసిందో చూశాం. బన్నీకి జోడిగా నేషనల్ క్ర‌ష్మిక‌ రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ తో పాటు సమంత స్పెషల్ ఐటమ్ సాంగ్ చేయటం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చింది. బన్నీ యాక్టింగ్ కు మాస్ జనాలు ఫిదా అయిపోయారు. అసలు బాలీవుడ్ లో ఎలాంటి ప్రమోషన్లు చేయకపోయినా పుష్ప హిందీ వెర్షన్ ఏకంగా రు. 100 కోట్లు కొల్లగొట్టింది.

ఓవ‌రాల్‌గా బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. పుష్ప 2 సినిమా ఎప్పుడు ?వస్తుందా అని బన్నీ అభిమానులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చేసింది. రేపు పుష్ప 2 రిలీజ్ డేట్ సాలిడ్ పోస్టర్తో చిత్ర బృందం రివిల్ చేయనుంది.

రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు కోసం ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్‌ చేసేలా.. బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఫాహ‌ద్ ఫాజిల్ – సునీల్ – అనసూయ భరద్వాజ్ – ధనుంజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో కూడా అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది.

పార్ట్ 1లో ఉన్న‌ రష్మిక తో పాటు మరో హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందని.. ఆ హీరోయిన్ ఎవరన్న‌ విషయాన్ని సుకుమార్ సస్పెన్స్ గా ఉంచుతున్నారని కూడా తెలుస్తోంది. ఇక రు. 1000 కోట్ల బాక్సాఫీస్‌ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news