Movies' ఆదిపురుష్ ' నుంచి మ‌రో డిజాస్ట‌ర్ వీడియో… ఉన్న ఆశ‌లు...

‘ ఆదిపురుష్ ‘ నుంచి మ‌రో డిజాస్ట‌ర్ వీడియో… ఉన్న ఆశ‌లు నీరు కారిపోయాయ్‌.. (వీడియో)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ సినిమాలలో ఒకటైన ఆదిపురుష్‌పై గత కొంతకాలంగా ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాలలో ఎంతో ఆసక్తి ఉంది. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం ఇండియన్ సినిమా దగ్గర భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటగా నిలుస్తోంది. గత రెండున్నర సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న‌ ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

రామాయణ ఇతిహాసం ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా, సీత‌గా కృతీస‌న‌న్ నటిస్తూ ఉండగా.. బాలీవుడ్ కండల హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా విలన్ గా నటిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ సింగిల్ తో పాటు ప్రభాస్ రాముడు అవతారంలో ఉన్న గెటప్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు సీతగా నటిస్తున్న కృతిసన‌న్‌ పై ఓ బ్యూటిఫుల్ వీడియో వదిలారు. రామాయణంలో కీలక ఘట్టమైన రావణ చెర‌లో ఉన్న సీతగా కృతిహాసన్ ను చూపించారు.

అలాగే ప్రభాస్ పై కూడా చిన్న పోస్టర్ లాంటిది చూపించారు. ఈ మోష‌న్‌ పోస్టర్ వీడియోలో బ్యాగ్రౌండ్ స్కోర్ కొంతవరకు బాగుంది. అయితే ఇప్పటివరకు ఆదిపురుష్‌ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, వీడియోలు ప్రేక్షకులను బాగా డిజ‌ప్పాయింట్ చేశాయి. ఇక సీత పాత్రలో నటిస్తున్న హీరోయిన్ కృతిసనన్‌ పాత్ర కూడా ఏమాత్రం ఆసక్తితో లేదు.

అసలు సీత పాత్రలో ఉన్న కృతిని చూస్తుంటే ఆ గెటప్ కూడా ఏమాత్రం సెట్ కాలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది సినిమాపై ఉన్న ఉత్సాహం.. ఆశలు రోజురోజుకు నీరుగారి పోతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news