Moviesఅఖిల్ ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్.. కోపంతో ఊగిపోయిన అమల లెఫ్ట్...

అఖిల్ ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్.. కోపంతో ఊగిపోయిన అమల లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిందిగా..!!

టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న అఖిల్ లేటెస్ట్ గా నటించిన సినిమా ఏజెంట్ . సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన .. ఈ సినిమా నిన్న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . బ్లాక్ బస్టర్ హిట్ టాక్ నమోదు చేసుకుంటుంది అంటూ ఆశగా ఎదురుచూసిన అక్కినేని అభిమానులకు నిరాశే మిగిలింది . అంతేకాదు పరమ చెత్త టాక్ ను క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురవుతున్నాడు అక్కినేని అఖిల్ .

ఈ క్రమంలోనే ఇన్నాళ్లు ఓపిగ్గా చూసిన అక్కినేని అమల ఫస్ట్ టైం అక్కినేని అఖిల్ పై జరుగుతున్న ట్రోలింగ్ పై డైరెక్ట్గా స్పందించింది . ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా అక్కినేని అమల ఎవరైతే తన బిడ్డను ట్రోల్ చేస్తున్నారో వాళ్లకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది . ఈ క్రమంలోనే అక్కినేని అమల.. సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘంగా ఓ నోట్ షేర్ చేసింది .

“సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎంత కామన్ గా అయిపోయిందో నాకు తెలుసు. నేను నిన్న ఏజెంట్ సినిమా చూశాను.. నిజంగా చెప్తున్నాను సినిమాలో తప్పులు ఉన్నాయి ..కాదనడం లేదు కానీ ఓపెన్ మైండ్ గా చూస్తే ప్రతి ఒక్కటి అద్భుతంగా అనిపిస్తుంది . అఖిల్ అక్కినేని పర్ఫామెన్స్ ఈ సినిమాలో చాలా బాగుంది.. నేను సినిమా చూస్తున్న థియేటర్లో చాలామంది లేడీస్ ఉన్నారు ..అమ్మలు – అమ్మమ్మలు – పిల్లలు అందరూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు ఆడవాళ్లు కూడా అఖిల్ పర్ ఫామెన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు “అంటూ ఓపెన్ గా తన బిడ్డను పొగిడేసింది . అంతేకాదు ఇలా పరోక్షంగా ట్రోలర్స్ కి ఇలాంటి ట్రోలింగ్ ఆపుకుంటే మంచిది అంటూ కూడా చెప్పకనే చెప్పేసింది అని అమలా పోస్ట్ ను అక్కినేని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news