Movies' ఏజెంట్ ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు… అఖిల్‌కు మ‌ర్చిపోలేని పీడ‌క‌ల...

‘ ఏజెంట్ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు… అఖిల్‌కు మ‌ర్చిపోలేని పీడ‌క‌ల ఇది..!

అక్కినేని హీరో అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా మూడు సంవత్సరాలుగా ఊరిస్తూ ఊరిస్తూ ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ కెరీర్ లోనే అత్యధికంగా రు. 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. అఖిల్ కి జోడిగా కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా… బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వసి రౌతేలా స్పెషల్ సాంగ్ లో ఆడి పాడింది. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్, సురేంద‌ర్ 2 బ్యాన‌ర్ల‌పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

అఖిల్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే తొలి ఆటకే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ఏకంగా వరల్డ్ వైడ్‌గా రు. 37 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే రు. 38 కోట్ల షేర్ వస్తేనే అఖిల్ బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కుతాడు. అయితే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో తొలిరోజే ఘోరమైన వసూళ్లు వచ్చాయి.

ఈ సినిమాకు జరిగిన బిజినెస్ కు వచ్చిన వసూళ్లకు ఏమాత్రం పొంతనలేదు. ఇక రెండో రోజు నుంచి థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ లెక్కను చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలు మిగిల్చేలా కనిపిస్తోంది. ఏజెంట్ మొదటి రోజు మొత్తం కలెక్షన్ల‌ విషయానికి వస్తే.. నైజాం: 1.33 కోట్లు – సీడెడ్: 64 లక్షలు – ఉత్తరాంధ్ర : 54 లక్షలు – ఈస్ట్ : 29 లక్షలు – వెస్ట్ : 30 లక్షలు – గుంటూరు: 52 లక్షలు – కృష్ణా : 6లక్షల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

ఇక ఏపీ, తెలంగాణ వ‌ర‌కు చూస్తే రు. 4 కోట్ల‌షేర్, 6.60 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్‌గా 4.95 కోట్ల షేర్ రాగా.. 8.60 కోట్ల గ్రాస్ వచ్చింది. రు. 37 కోట్ల నెట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఏజెంట్ ఇంకా రు. 32.05 కోట్లను రాబట్టాలి. అయితే అది అసాధ్యం… ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో మ‌రో డిజాస్ట‌ర్ సినిమాగా మిగిలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news