MoviesNTR 30 నుంచి గూస్‌బంప్స్ తెప్పించే అప్‌డేట్‌… తార‌క్ ఫ్యాన్స్‌కు భోజ‌నం...

NTR 30 నుంచి గూస్‌బంప్స్ తెప్పించే అప్‌డేట్‌… తార‌క్ ఫ్యాన్స్‌కు భోజ‌నం అక్క‌ర్లేదుగా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జాన్వీ కపూర్ తెలుగులోనే కాదు సౌత్ సినిమాలలో తొలిసారిగా నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ ది కావడం విశేషం.

త్రిబుల్ ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత ఏకంగా ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే. అలాగే ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఆయన చాలా కసితో పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. సోమవారం ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు ఒక కీలకమైన ఫైట్ ను తెరకెక్కిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ – యువ‌సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీలకమైన ఈ ఫైటింగ్ షూట్ ఇప్పటికే పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ సీన్లు చాలా బాగా వచ్చాయని ..ఇంటర్వెల‌కు 20 నిమిషాల ముందు వచ్చే ఈ ఫైట్ సీన్ చూస్తుంటే థియేటర్లలో గూస్‌బంప్స్‌ వస్తాయని మేక‌ర్స్‌ అంటున్నారు.

ఈ ఫైట్ సినిమాకు చాలా చాలా ప్లస్ అవుతుందని కూడా మేకర్స్ చెబుతున్నారు. ఈ మ్యాటర్ బయటకు రావడంతో ఇప్పుడు తార‌క్‌ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఎప్పుడు ఎప్పుడు ? వస్తాయా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వారికి ఈ గూస్ బంప్స్ అప్డేట్ మంచి విందులా మారింది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక నవంబర్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ నుంచి వార్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడట జూనియర్ ఎన్టీఆర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news