Moviesఅఖిల్ ' ఏజెంట్ ' సినిమాపై దిల్ రాజు పెద్ద‌ కుట్ర‌…...

అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమాపై దిల్ రాజు పెద్ద‌ కుట్ర‌… బండారం బ‌య‌ట పెట్టిన నిర్మాత‌…!

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వివాదాల చుట్టూ నడుస్తోంది. టాలీవుడ్లో హీరోల మధ్య, దర్శకుల మధ్య చివరకు ఇటు డిస్టిబ్యూటర్ల మధ్య కూడా ఆధిపత్య‌ పోరు ఎక్కువగా ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకటం గగనం అయిపోతుంది. ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా థియేటర్ల కోసం పెద్దపెద్ద గొడవలు జరుగుతున్నాయి. తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది

అలాగే మణిరత్నం పిఎస్ 2 సినిమా కూడా శుక్రవారం రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలకు థియేటర్లు కేటాయించే విషయంలో అఖిల్ ఏజెంట్ సినిమాకు అన్యాయం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నైజాంలో ఏజెంట్ సినిమాకు మంచి థియేటర్లు రాకుండా కుట్ర జరుగుతుందన్న ప్రచారం ఐదారు రోజుల నుంచి జరుగుతోంది. తాజాగా నిర్మాత న‌ట్టి కుమార్ థియేటర్లు కేటాయించే విషయంలో ఏజెంట్ సినిమాకు అన్యాయం జరిగింది అని.. అక్కినేని అఖిల్ ని తొక్కేయాలని దిల్ రాజు చూస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏజెంట్ సినిమాపై పెద్ద కుట్ర జరుగుతుందని.. అందులో దిల్ రాజు కీలకంగా ఉన్నారంటూ నట్టి ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ కారణంగానే ఏజెంట్ సినిమాకు థియేటర్లు దొరకకుండా చేసి వాటిని పిఎస్ 2 సినిమాకు ఇచ్చారంటూ ఆరోపించారు. అలా అని తాను మణిరత్నంను తక్కువ చేసి మాట్లాడటం లేదని.. రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పుడు టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

అయితే ఏజెంట్ విషయంలో అలా జరగలేదని నటి కుమార్ ఆరోపించారు. మణిరత్నం పిఎస్2 సినిమాకి మొదటి ప్రాధాన్యత ఇచ్చారని.. ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీగా ఉన్న అక్కినేని నాగార్జున కుటుంబానికి ఇలా అన్యాయం చేస్తే ఎవరు ? ఎందుకు బయటకు వచ్చి మాట్లాడారని న‌ట్టి ప్రశ్నించారు. నిర్మాత కౌన్సిల్లో ఉన్న సుప్రియ ఏం చేస్తున్నారంటూ కూడా న‌ట్టి ప్రశ్నించారు.

సినిమా ఇండస్ట్రీలో మోనోపల్లి బాగా నడుస్తుందని.. దిల్ రాజు ఆధిపత్యం కారణంగా చాలామంది నష్టపోతున్నారు అంటూ నట్టి తీవ్ర విమర్శలు చేశారు. ఏది ఏమైనా అఖిల్ సినిమాను తొక్కేసేందుకు దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారంటూ న‌ట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరి దీనిపై ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news