Moviesవామ్మో..ఆస్కార్ ఈవెంట్ లో చరణ్ భార్య వేసుకున్న నెక్లెస్ అన్ని కోట్లా.....

వామ్మో..ఆస్కార్ ఈవెంట్ లో చరణ్ భార్య వేసుకున్న నెక్లెస్ అన్ని కోట్లా.. దాని స్పెషాలిటి తెలిస్తే మైండ్ బ్లాకే..!!

ప్రజెంట్ కాలంలో సెలబ్రిటీస్ వేసుకున్న బ్రాండెడ్ ప్రొడక్ట్స్ గురించి బ్రాండెడ్ దుస్తులు గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు న్యూస్ లు వైరల్ అవుతూనే ఉన్నాయి . ఈ క్రమంలోనే రీసెంట్గా మెగా కోడలు ఉపాసన వేసుకున్న నెక్లెస్ కట్టుకున్న శారీ గురించి సోషల్ మీడియాలో ఒక్కటే న్యూస్ లు ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే ఉపాసన భర్త రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వరించింది . ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డు అందుకోవడానికి ఆర్ఆర్ఆర్ టీం తో పాటు ఉపాసన కూడా అమెరికా వెళ్ళింది .

అంతేకాదు అక్కడ సందడి చేసింది . ఈ క్రమంలోనే ఆవిడ కట్టుకున్న శారీ పెట్టుకున్న నెక్ సెట్ హైలెట్ అయ్యింది. హాలీవుడ్ ముద్దుగుమ్మల సైతం పదే పదే ఆమె పెట్టుకున్న నెక్ సెట్ గురించి చర్చించుకున్నారు . ఆమెను అడిగారు అంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని హాలీవుడ్ మీడియాలో మాట్లాడుతూ కూడా ఆమెతో ఆ నెక్లెస్ గురించి చర్చించింది హోస్ట్. ఆమెను గురించి ప్రశ్నించింది..

ఈ క్రమంలోని రామ్ చరణ్ సైతం ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. “ఈ ఈవెంట్ లో నా భార్యతో పాటు..ఆమె పెట్టుకున్న నెక్ సెట్ కూడా కాపాడుకోవాలి.” అంటూ చెప్పుకొచ్చాడూ. ఆస్కార్ ఈవెంట్లో చరణ్ భార్య లైట్ కలర్ సింపుల్ డిజైనర్ సారీ కట్టుకుని చాలా స్టైలిష్ గా చాలా ట్రెండీగా చాలా పద్ధతిగా కనిపించింది. సింపుల్ గా కనిపించే నెక్ సెట్ ని పెట్టుకుని అభిమానులను అట్రాక్ట్ చేసింది ఉపాసన .

ఆమె పెట్టుకున్న నక్లెస్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెక్లెస్ మొత్తం 400 ఒరిజినల్ రూబిలతో తయారు చేసిందట .అంతేకాదు దీని కాస్ట్ కూడా కోట్లలోనే ఉంటుంది అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఈ నెక్లెస్ ఆమెకి రామ్ చరణ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ కారణంగా గిఫ్ట్ చేశాడు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అందుకే రామ్ చరణ్ కి ఎంతో స్పెషల్ మూమెంట్ అయిన ఆస్కార్ అవార్డుకి ఈ నెక్లెస్ వేసుకుంది అంతేకాదు ఈ రూబీస్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసేసి వేరే నెక్లెస్ విధంగా కూడా మార్చుకోవచ్చు . దీంతో రామ్ చరణ్ భార్య ఉపాసన పెట్టుకున్న నెక్లెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

Latest news