Moviesరామ్‌చ‌ర‌ణ్ క‌ళ్లుచెదిరే ఆస్తులు ఇన్ని కోట్లా ... టాలీవుడ్‌లోనే హ‌య్య‌స్ట్ ట్యాక్స్...

రామ్‌చ‌ర‌ణ్ క‌ళ్లుచెదిరే ఆస్తులు ఇన్ని కోట్లా … టాలీవుడ్‌లోనే హ‌య్య‌స్ట్ ట్యాక్స్ పేయ‌ర్‌…!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ట్ అయిపోయాడు. సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్ ఎప్పుడు నేషనల్ వైట్ గా బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా హిట్ అయితే రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజీ అందుకోవటం మిగిలిన టాలీవుడ్ హీరోలకు చాలా కష్టం అవుతుంది.

చరణ్ సినిమాల గురించి చాలామందికి తెలుసు.. కానీ అతడి బిజినెస్, అతడి ఆస్తులు, అతడి లగ్జరీ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో చరణ్ తెలుగు సినిమా రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మగధీరతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అలాగే చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 తో నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు.

అటు సినిమాలు, ఇటు నిర్మాతగా, మరోవైపు వ్యాపారాలు, అటు కార్ రేసులు, ఇటు హాస్పిటల్ వ్యాపారాలు, అటు విమానాయన వ్యాపారం.. ఇలా చాలా వ్యాపారాలు చరణ్ చేశాడు. వీటితోపాటు పెప్సీ, టాటా డొకోమో, పొలాను, అపోలో, జియో, హీరో, ఫ్రూటీ వంటి 34 బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. చరణ్ ఒక్కో బ్రాండ్ ప్రమోట్ చేసినందుకు కోట్లలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. చ‌ర‌ణ్ వ్యక్తిగతంగా సంపాదించుకున్న ఆస్తులు విలువే 1500 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉంటుందని అంచనా.

చరణ కొత్తగా కటుక్కున్న ఇంటి విలువ సుమారు రు. 100 కోట్ల వరకు ఉంటుంది. చరణ్ నెల సంపాదన మూడు కోట్ల కంటే ఎక్కువే. అటు ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో తన పాత్ర కోసం రు. 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.మనదేశంలోనే ఎక్కువ ట్యాక్స్ చెల్లిస్తున్న వారిలో రాంచరణ్ ఒకుడు కావడం విశేషం. టాలీవుడ్ లో అయితే హైయెస్ట్ టాక్స్ పెయిడ్ చేసే హీరోలలో చరణ్ ఒకడిగా ఉన్నాడు.

ఇక హైదరాబాదులో జూబ్లీహిల్స్ లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో చరణ్ కు పెద్ద బంగ్లా ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ – టెంపుల్ – జిమ్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయి. దీని విలువ రు. 40 కోట్ల వరకు ఉంటుంది. దీనితో పాటు ముంబైలో ఒక పెంట్‌ హౌస్ చెన్నైలో కూడా కొన్ని ప్లాట్లు ఉన్నాయి. ఇక చరణ్ వాడే కార్లు కూడా చాలా ఖరీదైనవి.

నాలుగు కోట్ల విలువైన కష్టమైజ్‌డ్ మెర్సిడే ఆడి కారు, రోల్స్ రాయిస్, స్పాంటం రేంజ్ రోవర్, ఆస్టిన్‌ మార్టిన్, ఫెరారీ లాంటి కంపెనీల కార్లు ఉన్నాయి. అలాగే చరణ్ ఒక సొంత ప్రైవేట్ జట్‌ కూడా వాడుతూ ఉంటాడు. ఇవన్నీ చూస్తే చరణ్ ఆస్తులు కళ్ళు చెదిరే రేంజ్ లో ఉన్నాయని అర్థమవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news