MoviesManchu Manoj పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్‌ .. మండపం...

Manchu Manoj పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్‌ .. మండపం వెనుక అంత గొడవ జరిగిందా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ వేరే విపరీతంగా వైరల్ అవుతుంది. అటు రాజకీయాలలోనూ ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ మంచు మనోజ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.. దానికి మెయిన్ రీజన్ మంచు మనోజ్ ..దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడమే. 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ .. వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా 2019లో విడాకులు తీసుకున్నారు . ఈ క్రమంలోనే ఆయన రీసెంట్గా భూమా మౌనిక రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసి తన జీవితంలోకి ఆహ్వానించాడు .

అంతే కాదు భూమా మౌనిక రెడ్డి కొడుకుని కూడా తన కొడుకుగా భావించి యాక్సెప్ట్ చేశారు. ఈ క్రమంలోనే త్వరలోనే మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది . కాగా శుక్రవారం రాత్రి మంచు లక్ష్మి ఇంట్లో గ్రాండ్గా జరిగిన వీళ్ళ వివాహానికి సంబంధించిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో స్టేజి పైన మౌనిక రెడ్డి మామ మంచు మోహన్ బాబును హగ్ చేసుకుని ఏడ్చిన పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది .

అంతేకాదు పెళ్ళికొడుకుని చేసి స్టేజ్ ఎక్కే ముందు మంచు మనోజ్ కూడా ఎమోషనల్ అయ్యారట . ముందు నుంచి భూమా మౌనిక రెడ్డి , భూమా అఖిలప్రియ కి మంచు లక్ష్మి చాలా క్లోజ్.. మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే మౌనిక రెడ్డి అమ్మానాన్నలు ఈ శుభ సమయాన మా వద్ద లేరు అంటూ మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారట. దీంతో మౌనిక రెడ్డి కూడా ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది . ప్రజెంట్ ఈ జంట కొత్త మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. చూడాలి మరి మంచు మనోజ్ రాజకీయాలలో ఏ విధంగా నెట్టుకొస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news