Moviesత‌రుణ్‌తో ప్రియ‌మ‌ణికి పెళ్లి చేసేందుకు ట్రై చేసిందెవ‌రు… ఏం జ‌రిగింది…!

త‌రుణ్‌తో ప్రియ‌మ‌ణికి పెళ్లి చేసేందుకు ట్రై చేసిందెవ‌రు… ఏం జ‌రిగింది…!

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరుపొందిన తరుణ్‌కు రెండున్నర దశాబ్దాల క్రితం తిరుగులేని క్రేజ్ ఉండేది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే కావాలి సినిమాతో యూత్ లో ఒక్క సారిగా పాపులర్ అయిపోయాడు. ఆ సినిమా తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ వెంటనే తరుణ్‌కు వరస పెట్టి పెద్ద పెద్ద బ్యానర్లలో అవకాశాలు వచ్చాయి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో ప్రియమైన నీకు సినిమా చేస్తే సూపర్ హిట్ అయింది. ఆ వెంటనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నువ్వు లేక నేను లేను సినిమా చేస్తే అది మంచి హిట్ అయింది. ఇలా తరుణ్ వరుస పెట్టి పెద్ద బ్యానర్లలో సూపర్ హిట్ సినిమాలు చేశాడు.

ఈ క్రమంలోనే తరుణ్.. దివంగత వర్ధమాన హీరోయిన్ ఆర్తి అగర్వాల్‌తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. ఆర్తి అగర్వాల్తోనే తరుణ్ అదే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సోగ్గాడు సినిమా కూడా చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. ఆర్తీతో బ్రేకప్ తర్వాత లవర్ బాయ్‌గా పేరున్న తరుణ్ ప్రియమణితో కలిసి నవవసంతం సినిమాలో నటించాడు. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తరుణ్, ప్రియమణి ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఇండస్ట్రీలో హార్ట్ టాపిక్ గా మారాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ నడుస్తుండగా తరుణ్, ప్రియమణి ప్రేమలో ఉన్నారన్న పుకార్లు బాగా వైరల్ కావడంతో.. ఒకరోజు తరుణ్ తల్లి రోజా రమణి నేరుగా సెట్లోకి వెళ్లారట. ఆమె ప్రియమణిని కలిసి మీ ఇద్దరు నిజంగా ప్రేమలో ఉన్నారా ? ఒకవేళ అదే నిజం అయితే మీ ఇద్దరికీ పెళ్లి చేయటానికి మాకు ఎలాంటి ?అభ్యంతరం లేదని నేరుగానే అడిగేసారట. నీ మనసులో ఏ విషయమైనా సరే నాకు ఫ్రెండ్లీగా చెప్పు అని కూడా ఆమె రిక్వెస్ట్ చేశారట. రోజా రమణి తనను అలా అడగడంతో వెంటనే షాక్ అయింద‌ట‌ ప్రియ‌మ‌ణి.
ఎందుకంటే అంతకుముందే తరుణ్, ఆర్తి అగర్వాల్ ని పెళ్లి చేసుకోవటం తరుణ్ తల్లి రోజారమణికి ఇష్టం లేదని.. ఆమె వల్లే తరుణ్ ఆర్తికి దూరమయ్యాడ‌ని ప్రచారం జరిగింది.

అయితే ఈసారి ప్రియమైన విషయంలో రోజా రమణీయ స్వయంగా ఆమె దగ్గరికి వెళ్లి తన కొడుకుని నువ్వు ఇష్టపడితే.. మీ ఇద్దరికీ పెళ్లి చేయటానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పటం షాకింగ్. అయితే అప్పట్లో ప్రియ‌మ‌ణి అవన్నీ రూమర్స్ అని.. ఈ విషయం మీరు చెప్పేవరకు నాకు తెలియదని చెప్పిందట. ఏది ఏమైనా తరుణ్ తో తాను ఒక్క సినిమాలో నటిస్తేనే ఇలాంటి రూమర్లు వచ్చాయని.. అవన్నీ అవాస్తవాలే అని ప్రియమణి అప్పట్లో క్లారిటీ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news