Moviesమంచు బ్ర‌ద‌ర్స్ గొడ‌వ‌కు కార‌ణం ఆ అమ్మాయేనా… అక్క‌డే తేడా వ‌చ్చిందా...

మంచు బ్ర‌ద‌ర్స్ గొడ‌వ‌కు కార‌ణం ఆ అమ్మాయేనా… అక్క‌డే తేడా వ‌చ్చిందా ?

టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు కుటుంబానికి క్రమశిక్షణ విషయంలో మంచి పేరు ఉంది. మోహన్ బాబు ఇద్దరు వారసులు సినిమాలపరంగా ఎంతవరకు సక్సెస్ ? అయ్యారు అన్నది పక్కన పెడితే.. క్రమశిక్షణ విషయంలో తండ్రి నుంచి చాలా నేర్చుకున్నారని.. ఇండస్ట్రీలో ఇప్పటివరకు వినిపించిన టాక్. అయితే తాజాగా మోహన్ బాబు అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ షాక్‌కు గురయ్యేలా ఒక వీడియో బయటకు వచ్చింది.

ఆ వీడియోలో మంచు విష్ణు.. మోహన్ బాబు కుటుంబానికి సన్నిహితంగా ఉండే సారధి అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లి గొడవ పడుతూ ఉండటం.. సారధితో పాటు మరో వ్యక్తి విష్ణును కంట్రోల్ చేయడానికి ప్రయత్నించటం.. మనోజ్ ఆ వీడియోను తీస్తూ ఇలా మా బంధువులను కొట్టడానికి వస్తూ ఉంటారని చెప్పటం.. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వటం చూసాం. మనోజ్ ఈ వీడియోను ముందుగా తన సోషల్ మీడియా వేదికలలో పోస్ట్ చేయగా బాగా స్ప్రెడ్ అయింది.

వెంటనే మోహన్ బాబు మనోజ్‌కు వార్నింగ్ ఇచ్చి ఆ వీడియోను డిలీట్ చేయించారన్న ప్రచారం కూడా బయటకు వచ్చింది. మోహన్ బాబు అంటేనే ఎంతో క్రమశిక్షణ. మరి ఆయన వారసులు కూడా ఇప్పటివరకు ఇంటర్నల్ గా ఎలా ఉన్నా ? రోడ్డుకి ఎక్కలేదు. మరి ఇప్పుడు వీరిద్దరి మధ్య సఖ్యత ఎందుకు చెడింది ? అసలు గొడవకు కారణం ఏంటన్న దానిపై ఇండస్ట్రీలోనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మనోజ్ కొద్దిరోజుల క్రితమే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. అయితే వీరిద్దరి మధ్య పాత పరిచయం ఉంది. అనుకోకుండా ఇద్దరికీ తొలి పెళ్లి కలిసి రాలేదు. ఈ క్రమంలోనే పాత స్నేహం చిగురించి కొత్త ప్రేమగా మారి వీరు పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది. అయితే వీరు మూడేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారట. అది ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. మౌనికకు తొలి భర్త గణేష్ రెడ్డితో పెళ్లి జరగడంతో పాటు ఒక బాబు కూడా జన్మించాడు. మరో వ్యక్తికి జన్మించిన బాబు ఉన్న మౌనికను ఎలా ? పెళ్లి చేసుకుంటావు అని మంచు ఫ్యామిలీ మనోజ్ ను నిలదీసినట్టు కూడా ఇండస్ట్రీలో ప్రచారం అయితే నడుస్తోంది.

గణేష్ రెడ్డికి – మౌనిక రెడ్డికి జన్మించిన బాబు మంచు ఫ్యామిలీకి ఎలా వారసుడు ? అవుతాడు అన్నదే వీరి ప్రశ్నట. అయితే మనోజ్ మాత్రం తనకు అలాంటి పట్టింపులు ఉండవని.. మౌనికను తాను ఎంతో ఇష్టపడ్డానని.. ఆమె కూడా తనను నమ్మింది అని చాలా ఘాటుగానే తండ్రికి, అన్న విష్ణుకి చెప్పినట్టు తెలిసింది. మ‌నోజ్ పెళ్ల‌య్యాక కూడా మౌనిక కొడుకు కూడా త‌న‌కు వార‌సుడు అని చెప్ప‌క‌నే చెప్పేశాడు.

ఈ గొడవ జరిగాక మనోజ్ వచ్చి డాడీ నేను మౌనికని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఒకసారి ఆలోచించుకో అన్నానని.. అయినా కూడా లేదు డాడీ నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడంతో మనోజ్ ఇష్టానికి వదిలేసాన‌ని మోహ‌న్‌బాబు కూడా చెప్పారు. ఏది ఏమైనా మనోజ్ రెండో పెళ్లి మోహన్ బాబుకు, విష్ణుకు ఇష్టం లేదని ఆ కారణం వల్లే అన్నదమ్ముల మధ్య కూడా గ్యాప్ వచ్చిందని.. అదే ఈ గొడవకు కారణమైందని అంటున్నారు. మరి నిజానిజాలు ఏంటన్నది మంచు ఫ్యామిలీకే తెలియాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news