Moviesనందమూరి ఇంటి అల్లుడు అవ్వాల్సిన మహేశ్ బాబు ని అడ్డుకుంది ఎవరు..?...

నందమూరి ఇంటి అల్లుడు అవ్వాల్సిన మహేశ్ బాబు ని అడ్డుకుంది ఎవరు..? తెర వెనుక ఇంత జరిగిందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. గతంలో జరిగిన విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . పాత జ్ఞాపకాలను తవ్వి లోడి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ఈమధ్య కాలంలో కామన్ గా వినిపిస్తుంది . అలాంటి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . గతంలో నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణిని టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా ఉన్న మహేష్ బాబు పెళ్లి చేసుకోవాల్సి ఉందని ..కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఆ సంబంధం రిజెక్ట్ అయి బ్రాహ్మణి నారా వారి ఇంటి కోడలు అయిందని నమృత ఘట్టమనేని ఇంటికి కోడలు అయింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

నందమూరి బాలకృష్ణకు సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అప్పట్లో నందమూరి తారక రామారావు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు. అదే ఫ్రెండ్షిప్ ఆ తర్వాత జనరేషన్ లో కూడా ముందుకు వెళ్ళింది . అయితే ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ ..మహేష్ బాబుని అల్లుడుగా చేసుకోవాలని అనుకున్నారట . ఈ విషయం కృష్ణకు కూడా తెలుసట . కానీ అప్పటికే మహేష్ బాబు నమ్రత లవ్ లో ఉన్నారని.. ఆ విషయాన్ని కృష్ణకు చెప్పగా కృష్ణ ఓపెన్ గా నందమూరి బాలకృష్ణకు చెప్పేసారని ..పిల్లలుకి ఇష్టం లేకుండా పెళ్లిళ్లు చేయకూడదని ..డిసైడ్ అయ్యి ఇద్దరు ఆ తర్వాత ఈ సంబంధాన్ని వద్దనుకున్నారని ఓ టాక్ వైరల్ అవుతుంది .

అంతేకాదు ఒకవేళ ఈ సంబంధం కుదిరి ఉంటే నిజంగా ఇండస్ట్రీలో ఇది ఒక మధురమైన మూమెంట్ గా మిగిలిపోయి ఉండేది . నందమూరి ఇంటి అల్లుడుగా మహేష్ బాబు ఊహించుకుంటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఒకటి మాత్రం నిజం పెళ్లయిపోయి ఒకరింటికి వెళ్లిపోయిన ఆడపిల్లపై ఇలా మాట్లాడుకోవడం దారుణాతి దారుణం.. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ వార్తను ఇక్కడితో ఆపేస్తే మంచిది అంటూ కొందరు నందమూరి ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి నందమూరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని ఆ ఆకతాయిలు వింటారో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news