Moviesఅన్ని చూపించాలి… ఎప్పుడు పిలిచినా రూమ్‌కు రావాలి… హీరోయిన్ కు ...

అన్ని చూపించాలి… ఎప్పుడు పిలిచినా రూమ్‌కు రావాలి… హీరోయిన్ కు డైరెక్ట‌ర్ బంపర్ ఆఫర్ …!

సినిమా రంగం అనేది ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎవరిని నమ్మటానికి ఛాన్స్ లేదు. ముఖ్యంగా హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఛాన్సులు కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో గొప్ప స్టార్ హీరోయిన్లు సైతం కెరీర్ ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ బాధితులు అయినవారే. అయితే ఇటీవల కాలంలో హీరోయిన్లలో చాలా మార్పు వచ్చింది. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను దాచుకోకుండా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. లేకపోతే సోషల్ మీడియా వేదికగా బట్టబయలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక తమిళ నటి తనకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి ఇప్పుడు బయట పెట్టింది. క‌డైకుట్టి సింగం అనే సీరియ‌ల్లో నటించిన ఆ నటి.. తాను ఎలాంటి ? లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానో చాలా ధైర్యంగా వెల్లడించింది. ఆ సీరియల్ తో నటి జీవిత బాగా పాపులర్ అయింది. తమిళనాడులో ఈ సీరియల్ చూసే వారితో పాటు.. బుల్లితెర అభిమానుల్లో చాలా మంది జీవితను బాగా అభిమానిస్తూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి.. దాని వల్ల‌ తాను మిస్ అయిన ఆఫర్ల గురించి చెప్పుకొచ్చింది.

ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక దర్శకుడి వద్దకి అడిషన్స్ కు వెళ్ళిందట. ఆ దర్శకుడు ఆమెను చూసిన వెంటనే నీకు హీరోయిన్‌గా బంపర్ ఆఫర్ ఇస్తాను.. అలాగే నిర్మాతతో చెప్పి అధిక రెమ్యున‌రేషన్ కూడా ఇప్పిస్తాను.. నా సినిమాలలో వరుసగా అవకాశాలు ఇస్తాను.. అయితే కొద్ది రోజులపాటు నువ్వు సర్దుకుపోవాలి అని చెప్పారట. ఆ డైరెక్టర్ అలా ఎందుకు అంటున్నాడో ? జీవితకు ముందుగా అర్థం కాలేదట. ఆ తర్వాత మెల్లగా అసలు విషయం బయట పెట్టాడట. డైరెక్టర్, కెమెరామెన్, నిర్మాత, మేనేజర్లతో సర్దుకుపోతూ ఉండాలి. వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రూమ్ కి రావాలి అని చెప్పాడట.

జీవిత ఆ డైరెక్టర్ తో మాట్లాడటం అదే మొదటిసారి. ఆయన అలా చెప్పడంతో ఏం చేయాలో తెలియక తనలో తానే కుమిలి కుమిలి ఏడ్చేసిందట. చాలా అవమానంగా ఫీల్ అయ్యి.. వెంటనే అక్కడ నుంచి బయటకు వచ్చేసిందట. తను ఎప్పుడూ కూడా ఆ డైరెక్టర్ వైపు మరోసారి కన్నెత్తి కూడా చూడలేదని జీవిత చెప్పుకు వచ్చింది. దీనిని బట్టి కెరీర్ ప్రారంభంలో కొత్త హీరోయిన్లు ఎలాంటి ? లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారో క్లియర్‌గా మరోసారి బయటపడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news