Moviesఅందాల రాశి ఎడ‌మ‌క‌న్నుకు ఏమైంది… ఆ ప్రాబ్ల‌మ్ ఎందుకొచ్చింది…!

అందాల రాశి ఎడ‌మ‌క‌న్నుకు ఏమైంది… ఆ ప్రాబ్ల‌మ్ ఎందుకొచ్చింది…!

ఆమె నిజంగానే అందాల రాశి వెండితెరపై ఎంతో నిండుగా కనిపించే బంగారు బొమ్మ. ఒకప్పుడు రాశి సినిమాలో ఉందంటే కేవలం ఆమెను చూసేందుకే థియేటర్లకు వెళ్లిన లక్షల మంది తెలుగు సినీ ప్రేమికులు ఎందరో ఉన్నారు. అప్పట్లో రాశి అంటే ఒక అందాల దేవత. తెలుగు సినిమా పరిశ్రమలో కావలసినంత అందంతోపాటు టాలెంట్.. చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉన్న రాశి ఒక మోస్త‌రు హీరోయిన్ గానే ఉండిపోయింది. జగపతిబాబు, శ్రీకాంత్, వడ్డే నవీన్ ఇలా మిడిల్ రేంజ్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించిన రాశి నటసింహం బాలకృష్ణ కృష్ణ బాబు సినిమాలోను కనిపించింది.

అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత వ్యాపారం లోకి ఎంటర్ అయ్యి కోట్లాది రూపాయల టర్నోవర్ చేస్తోంది. ఇక బుల్లితెరపై కూడా రాశి అప్పుడప్పుడు కనిపిస్తూనే వస్తోంది. గత కొద్దిరోజులుగా రాశి ఎడమ కన్నులో ఏదో సమస్య ఉందని… అది ఆమె అందాన్ని దెబ్బతీసింది అని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

దీనిపై రాశి కూడా స్పందించింది. నాకు గత సినిమాలతో పోల్చి చూస్తే ఎడమ కన్ను.. ముక్కు ఏదో తేడాగా ఉందని అంటున్నారు. షూటింగుల్లో మూవీ మేకోవరకు ఇంట్లో లుక్‌ చాలా తేడా ఉంటుంది. ఇంట్లో మేకప్ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో మామూలుగా కనిపిస్తూ ఉంటాము.. దాని వల్ల కొన్ని తేడాలు ఉంటాయని రాశి తెలిపింది. ఇక షూటింగ్స్ చేసేటప్పుడు వంట పనిలేదు కాబట్టి.. బాగా నిద్రపోయే దానిని. ఇప్పుడు ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాల‌ని తెలిపింది.

పైగా శుభాకాంక్షలు సినిమా టైమ్ కు ఇప్పటికీ చాలా ఏళ్ళు గడిచిపోయాయి.. వయసులో వచ్చిన మార్పు వల్లే ఆ తేడా ఉంది తప్ప నా కంట్లో ఏమీ సమస్యలు లేద‌ని రాశి క్లారిటీ ఇచ్చింది. ఇక రాశి ముక్క విషయానికి వస్తే ఆమె సినిమాలలో ఉన్నప్పుడు ముక్కుపుడకలేదట. పాప పుట్టినప్పుడు ముక్కుపుడక పెట్టించుకుందట.. దానివ‌ల్ల‌ కూడా తన ముక్కు అప్పటికే ఇప్పటికీ కాస్త తేడాగా కనిపిస్తుందేమోనని రాశి సందేహం వ్యక్తం చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news