Moviesజక్కన్నను గజగజా వణికించిన సినిమా మూవీ ఇదే.. ఆ మూవీ ఫ్లాపై...

జక్కన్నను గజగజా వణికించిన సినిమా మూవీ ఇదే.. ఆ మూవీ ఫ్లాపై ఉంటే కెరీర్ మటాష్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తుండగా జక్కన్న రెమ్యునరేషన్ పెరుగుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ దర్శకుని పారితోషికం 200 కోట్ల రూపాయలు అని బోగట్టా. మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్న జక్కన్న ఈ సినిమాలో మరిన్ని ప్రత్యేకతలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారని బాహుబలి, బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ సినిమాలను మించేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం.

13 సంవత్సరాల వయస్సులోనే కథలు రాయటం మొదలుపెట్టిన జక్కన్న సినిమాల చుట్టూనే తన ఆలోచనలు తిరుగుతాయని చెప్పుకొచ్చారు. మేము మొత్తం 13 కజిన్స్ అని కళ్యాణ్ మాలిక్, నేను ఒకే ఏజ్ అని ఆయన తెలిపారు. కామిక్స్ బుక్స్ ను విపరీతంగా చదివేవాళ్లమని.. అందులోని పాత్రలను తీసుకుని కథలు చెప్పేవాడినని రాజమౌళి కామెంట్లు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ పీరియాడిక్ సినిమాలు అంటే ఇష్టమని జక్కన్న పేర్కొన్నారు.

నా ఆల్ టైం ఫేవరెట్ మూవీ విక్రమారుడు అని రాజమౌళి చెప్పుకొచ్చారు. క్యాస్టూమ్స్ విషయంలో నాకు అధికారం ఉండదని జక్కన్న పేర్కొన్నారు. నేను, నా భార్య ఒకరికొకరు కాళ్లు నొక్కించుకుంటామని ఆయన తెలిపారు. మగధీర సినిమా రిజల్ట్ విషయంలో తాను చాలా టెన్షన్ పడ్డానని బడ్జెట్ శృతి మించడం వల్ల నేను గజగజా వణికానని రాజమౌళి కామెంట్లు చేయడం గమనార్హం.

మగధీర హిట్టవ్వకపోతే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితేంటని ఎలా ? మొహం చూపించాలని అనిపించిందని రాజమౌళి పేర్కొన్నారు. సినిమా విడుదలైన రెండు రోజుల వరకు నేను కూల్ కాలేదని జక్కన్న చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ ప్యాకేజ్ అని కామెంట్లు చేసేవాళ్లకు ఆ కామెంట్ విషయంలో క్లారిటీ ఉండదని ఆయన తెలిపారు. తన ప్రతి సినిమాతో ప్రపంచ దేశాల సినీ ప్రేక్షకులను జక్కన్న సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు. మహాభారతం తన చివరి ప్రాజెక్ట్ అని జక్కన్న చెప్పగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news