Moviesసుకుమార్‌ను దారుణంగా అవమానించిన నాని.. అన‌వ‌స‌రంగా కెలుక్కున్నాడుగా...!

సుకుమార్‌ను దారుణంగా అవమానించిన నాని.. అన‌వ‌స‌రంగా కెలుక్కున్నాడుగా…!

న్యాచురల్ స్టార్ నాని అష్టాచమ్మా సినిమాతో క్లాస్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి తర్వాత రోజుల్లో పలు మాస్ ప్రాజెక్ట్ లలో నటించినా ఎక్కువగా క్లాస్ సినిమాలతోనే విజయాలను సొంతం చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నాని ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దసరా సినిమా గురించి పబ్లిసిటీ చేస్తూ ఈ సినిమాపై అక్కడి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో నాని ఇస్తున్న కొన్ని స్టేట్మెంట్లు వివాదాస్పదం అవుతున్నాయి. శ్యామ్ సింగరాయ్ సమయంలో థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం మంచిది అంటూ నాని చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. ఆ కామెంట్లు శ్యామ్ సింగరాయ్ కలెక్షన్లపై కూడా ప్రభావం చూపాయి. అయితే దసరా ప్రమోషన్స్ లో నాని చేసిన కామెంట్ సుకుమార్ ను అవమానించేలా ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

నాని మీడియాతో ముచ్చటిస్తూ పుష్ప సినిమా సమయానికి సుకుమార్ తెలుగు భాషలో బాగా పరిచయం అని ఇతర నాలుగు భాషల్లో పరిచయం కాదని.. దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అయిదు భాషల్లో పరిచయం కాదని విచిత్రమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే పుష్ప సినిమా రిలీజ్ సమయానికే ఇతర భాషల్లో సుకుమార్ కు అంతో ఇంతో పాపులారిటీ ఉంది. ఆర్య, 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు ఇతర భాషల్లో డబ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించాయి.

క్రియేటివ్ డైరెక్టర్ గా పేరును సొంతం చేసుకున్న సుకుమార్ రేంజ్ ను తగ్గించేలా ఆయనను అవమానించేలా నాని కామెంట్లు ఉన్నాయి. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలపై నానికి ఎంత నమ్మకం ఉన్నా మరీ సుకుమార్ తో పోల్చి కామెంట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో నాని చేస్తున్న కామెంట్లు ఆయనకు కొంతమంది ఫ్యాన్స్ ను దూరం చేస్తున్నాయి. ఈ కామెంట్ల గురించి సుకుమార్ స్పందిస్తారని చెప్పలేం కానీ ఈ కామెంట్ల వల్ల సుకుమార్ కచ్చితంగా హర్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news