Moviesకీర్తీ సురేష్ ల‌వ‌ర్‌గా ఆ యంగ్ హీరో... ఇంట్లో వాళ్ల‌కు ఇష్టంలేదా...!

కీర్తీ సురేష్ ల‌వ‌ర్‌గా ఆ యంగ్ హీరో… ఇంట్లో వాళ్ల‌కు ఇష్టంలేదా…!

కీర్తి సురేష్ చిరంజీవికి జోడిగా నటించిన అలనాటి మేటినటి మేనక కుమార్తె. త‌ల్లి వార‌స‌త్వంతో ఆమె కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నేను శైలజ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత తక్కువ సమయంలోనే పాపులర్ హీరోయిన్ అయింది. ముఖ్యంగా మహానటి సినిమా కీర్తి సురేష్ ను ఎక్కడికో తీసుకువెళ్లింది. ఆ సినిమాలో అచ్చు గుద్దినట్టు సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ లో పలువురు హీరోలతో నటించిన ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేదు.

కీర్తి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటంతో పాటు కమర్షియల్ మీటర్ కు దూరంగా.. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ఓటిటి కంటెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆమె రేసులో కాస్త వెనకబడిపోయింది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమా ఆమె దశ మారుస్తుంది అనుకుంటే పేరు రాలేదు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది.

ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రీ ఇచ్చిన చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య‌ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ దసరాకు భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు, కీర్తి సురేష్ అన్న, చెల్లిగా నటిస్తున్నారు. తమిళ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే ఆవ‌కాశం సుశాంత్ కు దక్కింది. ఆల వైకుంఠ‌పురంలో సినిమాలో సుశాంత్ కీలకపాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో సుశాంత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ క్రమంలోనే సుశాంత్ రవితేజ రావణాసుర సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో సుశాంత్ కీర్తి సురేష్ లవర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

వేదాళం మూవీలో ఈ క్యారెక్టర్ చాలా చిన్నగా ఉంటుంది. అయితే తెలుగులో సుశాంత్ కోసం ఈ పాత్ర లెన్త్‌ కొంచెం పెంచారు. అయితే కీర్తి సురేష్ – సుశాంత్ ప్రేమకు ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోతే చిరంజీవి వాళ్ళకు ఎలా ? అండగా ఉన్నారు అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా కథ ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా సుశాంత్ కీర్తి సురేష్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news