Moviesఅలా చేసి పాపులారిటి సంపాదించుకున్న ముద్దుగుమ్మలు వీరే.. ఏం అదృష్టం రా...

అలా చేసి పాపులారిటి సంపాదించుకున్న ముద్దుగుమ్మలు వీరే.. ఏం అదృష్టం రా బాబు..!!

అదేదో మహేష్ బాబు సినిమాలో ఓ డైలాగ్ చెప్పినట్లు.. ఎప్పుడు వచ్చామా అన్నది కాదు .. బుల్లెట్ దిగిందా లేదా అదే స్ట్రాటజి ని ఫాలో అవుతున్నారు ఇండస్ట్రీలో ఉండే ముద్దుగుమ్మలు . సినిమా ఇండస్ట్రీ లోకి ఎప్పుడు వచ్చామా ఎలా వచ్చామో అన్నది కాదు హీరోయిన్గా సక్సెస్ అయ్యామా.. కోట్ల ఆస్తులు సంపాదించుకున్నామా.. అంతకంటే ఇంపార్టెంట్ అయిన అభిమానుల్ని మన వెనక తిప్పుకున్నామా.. ప్రెసెంట్ ఇదే స్ట్రాటజీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది .

కాగా ఇప్పుడు మనం తెరపై చూస్తున్న ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ కెరియర్ మొదట్లో వెండితెరపై మెరిసిన స్టార్ సెలబ్రిటీస్ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి హీరోయిన్స్ లిస్ట్ లోకి వస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ముద్దుగుమ్మలు…!!

నయనతార : నయనతార మొదట ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయం అవ్వకముందు పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది . యాంకర్ గా కూడా చేసింది . ప్రెసెంట్ సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. అమ్మడు ఒక్కో సినిమాకి దాదాపు పది కోట్లు తీసుకుంటూ ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది .

కీర్తి సురేష్ : మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రెసెంట్ దసరా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. కీర్తి సురేష్ కూడా సీరియల్స్ ద్వారానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది . ఆమె తల్లి కూడా నటి కావడంతో హీరోయిన్గా ఈజీగా ఎదగగలిగింది.

సాయి పల్లవి : ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ లో కూడా నటించింది . ఆ తర్వాత డాక్టర్ చదువును పూర్తి చేసిన వెంటనే మలర్ సినిమాతో అవకాశం రావడంతో అటువైపుగా అడుగులు వేసింది . ప్రెసెంట్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది .

మృణాల్ ఠాకూర్ : రీసెంట్గా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఆడ్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ కూడా బాలీవుడ్లో పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లో కనిపించింది. సీతారామం సినిమా ద్వారా ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లోకి ఆడ్ అయిపోయింది. ఇలా ఈ ముద్దుగుమ్మలు మొదట వెండితెరపై ఆ తర్వాత బుల్లితెరపై తమ లక్ ని పరీక్షించుకుంటూ డైరెక్టర్స్ తలరాతనే మార్చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news