Moviesతార‌క‌ర‌త్న‌ను ఇంత టార్చ‌ర్ పెట్టారా.. ఇంత బాధ‌ప‌డ్డారా... గుండెలు పిండేసిన అలేఖ్య...

తార‌క‌ర‌త్న‌ను ఇంత టార్చ‌ర్ పెట్టారా.. ఇంత బాధ‌ప‌డ్డారా… గుండెలు పిండేసిన అలేఖ్య లేఖ‌…!

నందమూరి తారకరత్న ఈ లోకాన్ని వదిలి వెళ్లి నెల రోజులు అవుతుంది. అయితే ఇప్పటికీ తారకరత్న జ్ఞాపకాలు చాలామంది మదిలో అలాగే మెదులుతున్నాయి. తారకరత్న స్వతహాగా మంచి వ్యక్తి. ఎవరితోనో విభేదాలకు వెళ్లే మనస్తత్వం కాదు. ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయతతో.. అనురాగంతో పలకరించే మనస్తత్వం ఉన్న మనిషి. తారకరత్న తన భార్య అలేఖ్య రెడ్డి ఇద్దరు కలిసి జీవించడానికి ఒక యుద్ధమే చేశారని చెప్పాలి. ఎన్నో అడ్డంకులను జయించి వీరిద్దరూ ఒకటయ్యారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మహా అయితే వీరిద్దరూ ఒక పది సంవత్సరాలపాటు సంతోషంగా కలిసి కాపురం చేశారు.

అయితే విధి ఆడిన వింత నాటకంలో తారకరత్న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఎంత లేదన్నా భర్త లేని బాధ అలేఖ్య రెడ్డిని అలా దహించి వేస్తూనే ఉంటుంది. వీరి ప్రేమకు గుర్తుగా కుమార్తె నిషికా తో పాటు కవలలు త‌న‌య్ రామ్‌, రియా జన్మించారు. అలేఖ్య రెడ్డి తన భర్త తనతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. తను లేని లోటు గురించి బాధపడుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఈ పోస్టులు చదువుతుంటే చాలా బాధ కలుగుతుంది.

తాజాగా ఆమె మరో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్టు సంచలనంగా కూడా కనిపిస్తోంది. నీ జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను దహించి వేస్తున్నాయి. మన స్నేహం ప్రేమగా మారింది. నేను కొంత ఆందోళనతో ఉన్నా… నువ్వు మాత్రం కచ్చితంగా కలిసి జీవించబోతున్నామంటూ ఎంతో నమ్మకంతో చెప్పావు. అప్పటినుంచి ఆ క్షణం కోసం ఎంతో పోరాటం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. మన వివాహంపై ఒక గందరగోళం.. మనపై వివక్ష అయినా నువ్వు నా చెంత ఉన్నందుకు ఎంతో సంతోషించాను.

నిష్కమ్మ పుట్టాక మన జీవితమే మారి ఆనందం రెట్టింపు అయింది. అయినా కష్టాలు అలాగే ఉన్నాయి. మనపై చిందుతున్న ద్వేషాన్ని తప్పించుకునేందుకు మన కళ్ళకు గంతలు కట్టుకుని బతికాం. నువ్వు నీ కుటుంబానికి దూరమయ్యావు. మనకంటూ పెద్ద కుటుంబం ఉండాలని ఎప్పుడూ కలలు కనే వాడివి.
ఆ కల 2019 లో కవలల జననంతో నిజమయింది. నీ చివరి శ్వాస వరకు ఎన్నో కష్టాలు పడ్డావు. నీ గుండెల్లో ఉన్న బాధ ఎవరికి అర్థం కాలేదు. దానిని ఎవరూ పట్టించుకోలేదు.

మనకు బాగా కావలసిన వాళ్లే మన మనసుకు పదేపదే గాయం చేస్తే దాన్ని భరించలేము. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా.. నేను ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. నువ్వు రియల్ హీరో.. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం. మనం మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను అని చాలా బాధతో అలేఖ్య రాసుకొచ్చింది. దీనిని బట్టి తారకరత్న అలేఖ్యను పెళ్లి చేసుకోవడానికి… పెళ్లి చేసుకున్నాక ఎంత బాధ అనుభవించారో.. తన కుటుంబం నుంచి ఎంత వివక్షతకు గురయ్యారు అన్నది ఆమె మాటల్లోనే తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news