Moviesపిచ్చి కూతలు కూసిన యంగ్ హీరోయిన్.. తిక్క రేగి బ్లాక్ చేసిన...

పిచ్చి కూతలు కూసిన యంగ్ హీరోయిన్.. తిక్క రేగి బ్లాక్ చేసిన అల్లు అర్జున్..అసలు ఏమైందంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్లో ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బన్నీ సినిమా వస్తుందంటే దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బన్నీకి సోషల్ మీడియాలో కూడా రోజురోజుకు విపరీతంగా ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. బన్నీ సోషల్ మీడియా అకౌంట్ల‌ను ఫాలో అయ్యే వారిలో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారు. అయితే బన్నీతో ఒక ప్లాప్ సినిమాలో నటించిన ఒక హీరోయిన్ ఇప్పుడు బన్నీ పై సంచలన ఆరోపణలు చేసింది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు బన్నీ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వరుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల పెళ్లి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ అయినా సాంప్రదాయ పద్ధతిలో జరిగిన హీరో హీరోయిన్ల పెళ్లి వేడుక మాత్రం ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది ఐదు రోజుల పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయం అయింది భాను శ్రీ మెహ్రా.

ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఆమెకు వచ్చిన క్రేజ్‌ అంతా కాదు. దర్శకుడు గుణశేఖర్ సినిమా రిలీజ్ అయ్యే వరకు అసలు భాను శ్రీ మెహ్రా లుక్‌ను కూడా సస్పెన్స్ లో ఉంచేశారు. ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ?ఉన్నా భాను శ్రీ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో నటించింది. తాజాగా అల్లు అర్జున్ పై ఆమె సంచలన ఆరోపణలతో ఒక ట్వీట్ చేసింది.

అల్లు అర్జున్ తన ట్విట్టర్ను బ్లాక్ చేశాడని దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసింది. నేను వరుడు సినిమాలో అల్లు అర్జున్‌తో క‌లిసి నటించాను. ఈ సినిమా తర్వాత నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా నేను నా ప్రయత్నాలు ఆపలేదు. ఎన్నో కష్టాలు పడ్డాను.. అయితే బన్నీ నన్ను ట్విట్టర్లో బ్లాక్ చేశాడు అని రాసుకోవచ్చింది. అయితే ఈ ట్వీట్ చేసిన రెండు గంటల తర్వాత ఆమె మరో పోస్ట్ పెట్టింది.

గ్రేట్ న్యూస్ బన్నీ నన్ను అన్‌బ్లాక్ చేశాడని.. నేను ఆయనను ఎప్పుడూ నిందించలేదని రాసుకుంది.బన్నీ ఆమెను బ్లాక్ చేయడానికి కారణం ఏంటన్నది క్లారిటీ లేదు.అయితే భాను శ్రీ బన్నీతో వరుడు సినిమాలో నటించిన చనువును అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తుండడంతోనే బన్నీ ఆమె అకౌంటు బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. దీనిని కూడా ఆమె పబ్లిసిటీ కోసం వాడుకున్నట్టుగా కనిపిస్తోందని బన్నీ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై భాను శ్రీ నుంచి ఎలాంటి ? రిప్లై ఉంటుందో చూడాలి.



మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news