Moviesఅయ్యో స‌మంత‌కు మ‌రో పెద్ద క‌ష్టం… గండం గ‌ట్టెక్కుతుందా…!

అయ్యో స‌మంత‌కు మ‌రో పెద్ద క‌ష్టం… గండం గ‌ట్టెక్కుతుందా…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు గత కొంతకాలంగా కాలం కలిసి రావడం లేదు. నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత ఏం చేసినా ? వెనక్కు వస్తోంది. విడాకుల తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. అయితే అవేవీ ఆమెకు సరైన విజయాలు అందించలేదు. పుష్ప‌లో ఐటెం సాంగ్‌కు మంచి పేరు వచ్చినా సమంత మరీ ఘోరంగా, విచ్చ‌ల‌విడిగా అందాలు ఆర‌బోసేసిందన్న విమర్శలు ఆమెపై వచ్చాయి. యశోద సినిమా చేస్తే ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదు.

గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న శాకుంతలం సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఖచ్చితంగా తనకు తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెడుతుందని ఏడాదికాలంగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాలని అనుకున్నా కుదరలేదు. ఇప్పుడు ఏప్రిల్ 14 అంటున్నారు.. ఈ సినిమా ప్రమోషన్లకు కూడా రెడీ అవుతోంది.

సమంత కూడా ఫైనల్ కాపీ చూసి సూపర్ అనేసింది. సమంతల శాకుంతలంకు బాక్సాఫీస్ దగ్గర చాలా టఫ్ ఫైట్ ఎదురు కాబోతోంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 21 వరకు ప్రతి వారం క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మార్చి 30న నాని దసరా ఉంది. ఏప్రిల్ 7న రవితేజ రావణాసుర వస్తోంది. రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్యతో మామూలు ఫామ్ లో లేడు.

ఇక సమంత శాకుంతలం ఏప్రిల్ 14న వస్తుంటే.. ఏప్రిల్ 21న సాయిధరంతేజ్ విరూపాక్ష రిలీజ్ అవుతుంది. థ్రిల్లర్ జాన‌ర్లో వస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా సమంత శాకుంతలం సినిమాకు వారం ముందు.. వారం తర్వాత భారీ అంచనాలతో వస్తున్న సినిమాలు ఉన్నాయి. శాకుంతలం ఎంతో పెద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే తప్ప.. ఈ సినిమాల పోటీని తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే.

అసలే మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకుని ఖుషి సినిమా షూటింగ్ కు వస్తున్నా.. సమంత శాకుంత‌లం సినిమా ప్రమోషన్లపై కూడా పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఏదేమైనా శాకుంతలం ఫ్లాప్ అయితే సమంత ఒక్కసారిగా ఢ‌మాల్‌న కింద పడిపోవడం ఖాయం. మరి ఈ కఠిన పరీక్షను ఆమె ఎలా ? ఎదుర్కొంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news