Moviesఎన్టీఆర్ ఇంత డేంజ‌ర్లో ఉన్నాడా… మార‌క‌పోతే క‌ష్ట‌మే…!

ఎన్టీఆర్ ఇంత డేంజ‌ర్లో ఉన్నాడా… మార‌క‌పోతే క‌ష్ట‌మే…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత ఫామ్ లో ఉన్నా.. ఎన్నీ సూపర్ హిట్లు వచ్చినా.. ఎంత పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా.. తన కెరీర్ను ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడంలో మాత్రం సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్ళటం లేదు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన తోటి స్టార్ హీరోలు చక్కటి ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు.. కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక పద్ధతి ప్లానింగ్ లేకుండా కెరీర్లో వెనుక పడుతున్న పరిస్థితి ఉంది. మహేష్ కు నమ్ర‌తా రూపంలో మంచి ప్లానింగ్ ఉంది.

ఇక బన్నీకి అల్లు కాంపౌండ్ తో పాటు బన్నీ వాస్ ఉన్నారు. ప్రభాస్ కు యూవీ వంశీ ఉండనే ఉన్నాడు. ఇక రామ్ చరణ్ ఉపాసన జోక్యం మొదలయ్యాక ఎక్కడికో వెళ్లిపోయాడు. పవన్ కళ్యాణ్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఉన్నారు. ఇక ఎన్టీఆర్‌కు ఎవరు ఉన్నారు అని ప్రశ్నించుకుంటే ఆన్సర్ లేదు.
కళ్యాణ్ రామ్ బావమరిది హరి ఉన్నా అది కేవలం ఫైనాన్స్ వరకే అని.. సినిమా కథల ఎంపిక, దర్శకుల ఎంపిక, మంచి సినిమాలు సెట్ చేయడంలో ఎన్టీఆర్ కు సరైన ప్లానింగ్ లేదు.

అలాగే ఎన్టీఆర్ సోషల్ మీడియాని కూడా పట్టించుకోవడం లేదు. సరైన సోషల్ మీడియా కూడా లేదు.
పీఆర్ టీం కూడా మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే అంత గొప్ప టీం అయితే లేదని అంటున్నారు. ఏదో ఎందుకు త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు నటించిన రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత వెంటనే ఆచార్య సినిమా చేశారు. అనంతరం శంకర్ సినిమా మొదలైపోయింది.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత కూడా చ‌ర‌ణ్ కు సినిమాలు ఒకటి రెండు లైన్లో ఉన్నాయి.

త్రిబుల్ ఆర్ తర్వాత ఏకంగా ఏడాది పాటు ఎన్టీఆర్ ఖాళీగా ఉండిపోయాడు. కొరటాల శివ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ అంటే మరో ఏడాది పాటు ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే. కొరటాలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం మంచిదే.. కానీ పాన్ ఇండియా ఇమేజ్ పెంచే విషయంలో ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్నది చెప్పలేని పరిస్థితి.

ఏదేమైనా రాంచరణ్ ప్లాన్ చేసుకున్నట్టుగా ఎన్టీఆర్ కెరియర్ సరిగా ప్లాన్ చేసుకోలేదు. అందుకే త్రిబుల్ ఆర్ లాంటి మంచి హిట్ వచ్చాక కూడా ఏకంగా రెండేళ్లపాటు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. సోషల్ మీడియాలో చరణ్ త‌రపున ముంబై ఏజెన్సీ బలంగా పనిచేస్తుంది. బన్నీ కూడా దూసుకుపోతున్నాడు. అటు మహేష్ బాబు ఫాలోయింగ్ మామూలుగా లేదు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో స్టార్ ఇమేజ్ తో ఉన్నాడు.

ఇక తాజాగా అమెరికా టూర్ విషయంలో చరణ్ కు ఎన్టీఆర్ కు తేడా క్లియర్ గా తెలిసిపోయింది. రాంచరణ్ మీడియాలో ఎంత హైలైట్ అయ్యాడో చూసాం. ఎన్టీఆర్ ఈ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులను తప్పు పట్టలేము. ఎన్టీఆర్ కు బలమైన అభిమానులు ఉన్నారు. అయితే ఫ్యాన్సును ఆర్గనైజ్ చేయటం.. సోషల్ మీడియా ఆర్గనైజ్ చేయటం… మీడియాలో ఏం చేస్తే హైలైట్ అవుతామో తెలియకపోవటం ఎన్టీఆర్ మైనస్.

ఇవన్నీ ఓపక్క సరైన ప్లానింగ్ తో ఉంటూనే.. మరోవైపు సినిమాల విషయంలో కూడా ప్లానింగ్ తో ఉండాలి. ఈ విషయంలో ఎన్టీఆర్ కాన్సన్ట్రేషన్ చేయకపోతే క్రేజ్ పరంగా ఇబ్బందులు తప్పేలా లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news