Moviesఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నా.. ఎన్టీఆర్ కి ఆ హీరో అంటేనే...

ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నా.. ఎన్టీఆర్ కి ఆ హీరో అంటేనే ఇష్టమా..? రిలీజ్ అయిన ఫస్ట్ డే అన్ని సినిమాలు చూసేస్తాడా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తుతం ఎక్కడ చూసినా మారుమోగిపోతుంది. అసలే ఆరు వరుస సూపర్ హిట్ సినిమాలు. అందులోనూ త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్. ఈ ఒక్క సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు వరుస పెట్టి నేషనల్ ప్రాజెక్టులే చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తన కెరీర్లో 30వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిపై అధికారికి ప్రకటన కూడా వచ్చింది.

దీంతో ఈ సినిమాపై ఆస‌క్తి నెలకొనగా.. ఆ వెంటనే కేజీఎఫ్, సలార్ సినిమాల‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా కూడా రానుంది. తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ ఆస్కార్‌ ప్రోగ్రాం ముగించుకుని ఇండియాకు వచ్చిన ఎన్టీఆర్ తన హార్డ్ కోర్ ఫ్యాన్ మాస్‌కా దాస్ అయిన విశ్వక్సేన్ సినిమా దాస్‌కాద‌మ్మీ ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు.

ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ విశ్వక్సేన్ ఒక్కో సినిమా గురించి విడమర్చి చెపుతుంటే అక్కడున్న వారంతా నోరు వెళ్ళబెట్టారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ తాను చాలా ఏళ్లకు గానీ రియలైజ్ అయిన అంశాన్ని విశ్వక్ చాలా తక్కువ టైంలో తెలుసుకున్నాడని చెప్పిన ఎన్టీఆర్ విశ్వక్ చేసిన ప్రతి ఒక్క సినిమా గురించి విడమర్చి చెప్పడంతో పాటు.. ఆ పాత్రల గురించి చెప్పటం ఆ సినిమాల గురించి సంపూర్ణమైన అవగాహనతో మాట్లాడటం పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.

ఎన్టీఆర్ చాలా బిజీగా ఉంటాడు. తన సినిమాలు తాను చూసుకునే టైం ఉండదు. కానీ విశ్వక్ నటించిన అన్ని సినిమాలు చూడటం.. వాటి గురించి పూర్తిగా మాట్లాడటం అనేది విశ్వక్ కు మామూలు హైప్‌ కాదని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా రావడంతో ఈ సినిమాకు మంచి ప్లస్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news