Moviesదీప్తి సునైనకు రాడ్ దించేసిన షణ్ముఖ్… కొత్త గార్ల్ ఫ్రెండ్ ని...

దీప్తి సునైనకు రాడ్ దించేసిన షణ్ముఖ్… కొత్త గార్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన షన్ను..!!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళకి ప్రముఖ యూట్యూబఅర్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నెంబర్ వన్ యూట్యూబర్ గా ఇంతకుముందు ఉండేవాడు. కాగా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన పుణ్యమంటూ నెంబర్ వన్ కాస్త నెంబర్ 2 పోసిషన్ లోకి వెళ్లిపోయాడు . ప్రజెంట్ యూట్యూబ్లో హర్ష నెంబర్ వన్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు . కాగా ఒకప్పుడు షణ్ముఖ పేరు చెప్తే జనాలు ఊగిపోయేవారు . టాలీవుడ్ లో స్టార్ హీరోలకి ఎలాంటి క్రేజ్ ఉండేదో అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోయాడు.

పలు కవర్ సాంగ్స్ వెబ్ సిరీస్ తో పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ ..తన తోటి యూట్యూబఅర్ దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ ఆ తర్వాత చేసిన తోటి కంటెస్టెంట్ తో నడుచుకున్న పద్ధతి చూసిన దీప్తి సునైనా అతగాడికి బ్రేకప్ చెప్పేసింది . దాదాపు బ్రేకప్ చెప్పి కూడా సంవత్సరం కావస్తుంది. ఈ క్రమంలోనే ఈ జంట మళ్ళీ కలవాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. అయితే ఇప్పటివరకు అలాంటి సూచనలు ఏవి కనిపించట్లేదు . కాగా రీసెంట్గా మరోసారి షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియా వేదికగా దీప్తి సునయన కు షాక్ ఇచ్చాడు . తెరపై ఆయనకు పార్టనర్ గా వేరే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ షన్ను సంచలన నిర్ణయం తీసుకున్నారు .

షణ్ముఖ్ జస్వంత్ లేటెస్ట్ ప్రాజెక్ట్ కు లవర్ గా ఫణి పూజిత అనే అమ్మాయి తీసుకున్నారు. ఇటీవల “అయ్యయ్యో” ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. దీప్తితో బ్రేకప్ కావడంతో చేసేది ఏమీ లేక తన ప్రాజెక్ట్ కి షన్ను వేరే అమ్మాయిలని ఎంచుకుంటున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తుంది . షణ్ముఖ్ లవర్ గా రొమాన్స్ చేయాల్సిన దీప్తి మనస్పర్ధలతో దూరమయ్యారు . ఈ క్రమంలోనే ఆమెను కూల్ చేయడం మానేసిన షణ్ముఖ వేరే అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ బిజీ అయిపోయాడు అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి .మరోపక్క దీప్తి సునైనా కూడా షణ్ముఖ్ ను ఏ మాత్రం పట్టించుకోవట్లేదు ..పలు ప్రాజెక్టుతో బిజీగా ముందుకు వెళుతుంది , ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ జంట ఇక కలవదు అని అంటున్నారు జనాలు. మరికొంతమంది ఫ్యాన్స్ మాత్రం షణ్ముఖ దీప్తి ఎప్పటికైనా కలుస్తారు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి రాబోయే కాలానికి ఈ జంట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news