Movies"ఆ రోజు ఆయన చేసిన పనికి ఇప్పటికి నేను EMI లు...

“ఆ రోజు ఆయన చేసిన పనికి ఇప్పటికి నేను EMI లు కడుతున్న”.. ఎవ్వరికి తెలియని సీక్రేట్ ని చెప్పిన చరణ్..!!

ప్రజెంట్ మెగా వారసుడు రాంచరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన రీసెంట్గా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ మరికొద్ది గంటల్లో ఆస్కార్ అవార్డు చేత పట్టుకోబోతుంది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ టీం మొత్తం అమెరికాలో సందడి చేస్తుంది . కాగా ఇప్పటికే అమెరికా చేరుకున్న ఆర్ ఆర్ ఆర్ టీం.. పలు ఇంటర్వ్యూలకి హాజరవుతూ తమ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటుంది .

ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్గా హాలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంచరణ్ మాట్లాడుతూ నాన్న చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేశారు . “మా నాన్న అందరి లాంటి వారు కాదు.. డబ్బు విలువ తెలిసేలా పెంచారు . సాధారణంగా సెలబ్రిటీస్ ఇంట్లో పిల్లలకు డబ్బులు విచ్చలవిడిగా ఇచ్చేస్తారని ఓ భ్రమ ఉంటుంది. కానీ మా ఇంట్లో మాత్రం మా నాన్న మాకు అలా చేయలేదు. మా రూపాయి మమ్మల్ని సంపాదించుకోమని చెప్పారు. అందుకే ఆయన కారణంగా ఇప్పటికీ నేను ఈఎమై లు కడుతూనే ఉన్నాను .

మా నాన్న తలుచుకుంటే ఎప్పుడో నా దగ్గర డబ్బులు ఎక్కువ వచ్చేసేవి . కానీ మా నాన్న నాకు అలా డబ్బు ఇవ్వరు .. ఆ కారణంగానే నాకు కావాల్సిన ప్రతి వస్తువు నేనే కష్టపడి సంపాదించుకుని కొనుకున్నాను. ఏంఈ కట్టుకుంటున్నాను . ఒకందుకు మా నాన్న చేసింది చాలా మంచిదే .. నాకు డబ్బు విలువ తెలిసేలా చేసారు. మా నాన్న లాంటి నాన్న నాకు దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను “అంటూ చరణ్ హాలీవుడ్ ఛానల్లో చెప్పుకోరావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా ప్రెసెంట్ రాంచరణ్ అమెరికాలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆర్ ఆర్ ఆర్ టీంకు సపోర్ట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు మరింత స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.

Latest news