Movies#NTR30: జాన్వీక‌పూర్ ఫ‌స్ట్ లుక్‌లో ఈ రెండు ఇంట్ర‌స్టింగ్ పాయింట్లు గ‌మ‌నించారా..!

#NTR30: జాన్వీక‌పూర్ ఫ‌స్ట్ లుక్‌లో ఈ రెండు ఇంట్ర‌స్టింగ్ పాయింట్లు గ‌మ‌నించారా..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 30వ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా ఇదే. దాదాపు యేడాది పాటు ఎన్టీఆర్ ఈ సినిమా కోస‌మే వెయిట్ చేస్తున్నాడు. అటు ఆచార్య ప్లాప్ త‌ర్వాత కొర‌టాల చేస్తోన్న సినిమా ఇదే. ఇక ఈ ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీక‌పూర్ న‌టిస్తుందంటూ ముందు నుంచే ప్ర‌చారం జ‌రిగింది.

అస‌లు దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో ఈ సినిమాలో జాన్వీ ఉందా ? లేదా ? అన్న సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ ఈ రోజు జాన్వీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ప‌క్క‌న జాన్వీ అన్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో ఊరించి ఊరించి ఎట్ట‌కేల‌కు జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఎన్టీఆర్‌తో ఖ‌రారైంది.

ఇక పోస్ట‌ర్‌లో రెండు ఇంట్ర‌స్టింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి. జాన్వీ త‌న రెగ్యుల‌ర్ డ్రెస్‌కు భిన్నంగా తెలుగు సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో చీర‌క‌ట్టులో చాలా అందంగా క‌నిపిస్తోంది. చీర‌క‌ట్టులో న‌డుము చూపిస్తూ.. కాళ్లు క‌న‌ప‌డేలా స‌ముద్రం ఒడ్డున వెన‌క్కు తిరిగి చూస్తోంది. ఆ స్టిల్ చూడ‌డానికే రెండు క‌ళ్లు చాల‌నంత అందంగా ఉంది.

ఇక రెండో ఇంట్ర‌స్టింగ్ పాయింట్ సినిమా స‌ముద్రం నేప‌థ్యంలో ఉంటుంద‌ని ముందు నుంచి చెపుతున్నారు. అందుకే జాన్వీ పోస్ట‌ర్ కూడా స‌ముద్రం ద‌గ్గ‌ర చూపించారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే సినిమాలో జాన్వీ మాత్ర‌మే హీరోయిన్ కాద‌ని.. మ‌రో హీరోయిన్ కూడా ఉంటార‌ని తెలుస్తోంది. ఇక యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల‌పై మిక్కిలినేని సుధాక‌ర్ – నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news