MoviesRavanasura Teaser రావ‌ణాసుర టీజ‌ర్‌... సుశాంత్ - ర‌వితేజ యుద్ధం పేలింది...

Ravanasura Teaser రావ‌ణాసుర టీజ‌ర్‌… సుశాంత్ – ర‌వితేజ యుద్ధం పేలింది (వీడియో)

ధమాకా లాంటి సూపర్ హిట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా రావణాసుర. విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరున్న సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఏప్రిల్ 7, 2023న ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది.

తాజాగా ఈ రోజు ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. రావ‌ణాసుర టీజ‌ర్ అయితే చాలా చాలా ఇంట్ర‌స్టింగ్గా ఉంది. ఈ వీడియోలో ర‌వితేజ వ‌రుస హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన ఓ ప‌వ‌ర్ ఫుల్ క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా క‌నిపిస్తాడు. అయితే ఆ హ‌త్య‌ల‌కు అస‌లు కార‌ణం ఏంట‌న్న‌ది మాత్రం స‌స్పెన్స్‌. సాలీడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు అదిరిపోయే విజువ‌ల్స్‌తో టీజ‌ర్ క‌ట్ చేశారు.

ఇక సుశాంత్ విల‌న్‌గా చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. సుశాంత్ లుక్స్‌, స్టైల్ మాత్రం చాలా కొత్త‌గా ఉంది. టీజ‌ర్ అయితే సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేసింది. సీత‌ను తీసుకువెళ్లాలంటే స‌ముద్రం దాటితే స‌రిపోదు.. రావ‌ణుడిని కూడా గెల‌వాలి అని ర‌వితేజ చెప్పిన డైలాగ్ టీజ‌ర్‌కే హైలెట్‌గా ఉంది. సుశాంత్‌, ర‌వితేజ మ‌ధ్య ప‌వ‌ర్ ఫుల్‌గా సినిమా ఉంటుంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

ఈ సినిమాలో ర‌వితేజ‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దివ్యాంశ కౌశిక్ – పూజిత పొన్నాడ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రావు రమేష్ – మురళీ శర్మ – సంపత్ రాజ్- నితిన్ మెహతా కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు హర్షవర్దన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news