Movies"దసరా" మూవీ రివ్యూ: మాస్ కి అమ్మ మొగుడే.. హిట్...

“దసరా” మూవీ రివ్యూ: మాస్ కి అమ్మ మొగుడే.. హిట్ కొట్టావ్ రా నాని నా కొడకా..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా దసరా . న్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓ దెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయ్యి.. ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ అందుకుంది. ఇప్పటివరకు నాని తన కెరీర్ లో ఇలాంటి పర్ఫామెన్స్ ఇవ్వలేదు అనే స్థాయి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్గా నాని ఈ సినిమాతో హిట్ కొట్టాడని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మనకు తెలిసిందే గత కొంతకాలంగా నాని కెరియర్ లో ఎలాంటి ఓడిదుడుకులు ఎదుర్కొంటున్నారో. సరైన హిట్ లేక.. నాని లోని నటన బయటపెట్టే డైరెక్టర్స్ లేక.. నాని డిజాస్టర్ అందుకుంటూ వచ్చారు. కాగా ఆయన లాస్ట్ గా హిట్ అందుకున్న చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాలో నాని పెర్ఫార్మెన్స్ ఇరగదీసాడు . అయితే అంతకుమించిన రేంజ్ లో ఈ సినిమాలో చించేసాడు అంటూ నాని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కీర్తి సురేష్ కూడా విజృంభించేసిందని ..మహానటి తర్వాత క్లీన్ నటన పర్ఫామెన్స్ ఈ సినిమాలో చూపించింది అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు.

మరి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లో వచ్చే లాస్ట్ 30 నిమిషాలు సినిమాకి హైలైట్ గా మారుతుందని .. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఇలాంటి క్లైమాక్స్ డిజైన్ చేయలేదు అని శ్రీకాంత్ ఓదెలకు హాట్సాఫ్ చెబుతున్నారు . ఓవరాల్ గా సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మాస్ ఎంటర్టైనఅర్ గా ఉందని.. నాని ఈ సినిమాకు కచ్చితంగా అవార్డు అందుకుంటారు అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు .

అంతేకాదు సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెగటివ్ పాయింట్ లేకుండా శ్రీకాంత్ డైరెక్ట్ చేయడం నిజంగా హాట్సాఫ్ చెప్పే విషయమే అంటూ జనాలు ఓ రేంజ్ లో కామెంట్ చేస్తున్నారు. అంతేనా కొందరు నాని ఫాన్స్ ఫుల్ జోష్ లో ..హిట్ కొట్టావ్ రా నాని నా కొడకా అంటూ ట్యాగ్ చేసి మరి కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఈ శ్రీరామనవమికి నానికి పండగ లాంటి హిట్ దక్కిందని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news