Moviesఐపీఎల్‌లో బాల‌య్య‌… కొత్త రోల్లో రచ్చ‌కు రెడీ అవుతున్న న‌ట‌సింహం..!!

ఐపీఎల్‌లో బాల‌య్య‌… కొత్త రోల్లో రచ్చ‌కు రెడీ అవుతున్న న‌ట‌సింహం..!!

నందమూరి నటసిం హం బాలకృష్ణ గత రెండు సంవత్సరాలుగా పట్టిందల్లా బంగారం అవుతుంది. అఖండ, వీరసింహారెడ్డి ఇలాంటి సినిమాలతో రెండు వరుస సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇప్పుడు అనిల్ రావి పూడి సినిమాతో ఏకంగా హ్యాటృఇక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. వీరసింహ రెడ్డి సినిమా తొలి రోజు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది అంటే బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది.

అలాగే బాలయ్య అటు ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ టాక్ షోను కూడా ఒంటిచేత్తో సక్సెస్ చేసి పడేశాడు. అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అటు వెండి తెరతో పాటు ఇటు బుల్లితెర రాజకీయాలు చివరకు కమర్షియల్ వాణిజ్య ప్రకటనలలోనూ దూసుకుపోతున్న బాలయ్య ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తేందుకు సిద్ధమయ్యారు. తాజాగా క్రికెట్ కామెంట్రేటర్ గా బాలయ్య సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. ఈనెల చివరిలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాలయ్య తన కామెంట్రీతో అదరగొట్టనున్నారు.

ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ ప్రారంభోత్సవం రోజు ఎంటర్టైన్మెంట్ అదిరిపోయే లెవెల్లో ఉంటుందని కూడా స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. బాలయ్య లైవ్ లో ఎలా మాట్లాడుతారో ఇలాంటి కొత్త యాంకరింగ్ ఎలా చేస్తారు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 31న గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా ఐపిఎల్ 16వ సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. మొత్తం రెండు నెలలపాటు ఈ లీగ్ జరగనుంది.

మే 28న జరిగే ఫైనల్ తో ఐపీఎల్ టూర్ ని ముగుస్తుంది. ఇక ఇప్పటికే ఆహా టాక్ షోలో తెలుగు వెండితెర బుల్లితెర ప్రేక్షకులను బాలయ్య తన యాంకరింగ్ తో మెస్మరైజ్ చేసి పడేశారు. ఇప్పుడు ఐపీఎల్ లో కామెంట్రేటర్ గా ఏ స్థాయిలో విజృంభిస్తాడో అన్న ఆసక్తి అందరిలోనూ సహజంగానే ఉంది. ఇక 2019లో ప్రారంభమైన నాటి నుంచి స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో స్పోర్ట్స్ పరంగా నెంబర్ వన్ పొజిషన్లో నిలిచింది. భారత మాజీ క్రికెటర్లు వేణుగోపాలరావు, ఎమ్మెస్ కే ప్రసాద్, మిథాలీ రాజ్ లాంటి వాళ్లు ఇప్పటికే తమ కామెంటరీ తో అదరగొడుతున్నారు. మరి ఇప్పుడు బాలయ్య వాళ్ళకు పోటీగా ఎలా కామెంట్రీ చేస్తారో అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news