Moviesఎవ్వడ్రా..పవిత్ర ని తప్పుడు మనిషి అంటుంది.. మహా పతివ్రత నరేష్ కోసం...

ఎవ్వడ్రా..పవిత్ర ని తప్పుడు మనిషి అంటుంది.. మహా పతివ్రత నరేష్ కోసం ఏం చేసిందో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పవిత్ర – నరేష్ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా వీళ్ళ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి వీళ్ళపై నానారకాలుగా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . అయితే అదంతా ఫేక్ అని అది మొత్తం ఓ సినిమాలో భాగంగా చేసిన షూట్ అంటూ క్లారిటీ వచ్చేసింది . ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్క బోతున్న “మళ్ళీ పెళ్లి” అనే సినిమాలో పవిత్ర నరేష్ భార్యాభర్తలు గా నటించబోతున్నారు .

ఈ క్రమంలోనే ఆ పెళ్లికి సంబంధించిన షూట్ ను చేశారని తెలుస్తుంది . కాగా ఈ వీడియోని పట్టుకొని కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పవిత్రను నరేస్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే పవిత్ర – నరేష్ ల ప్రేమకు కొందరు ప్రముఖులు సపోర్ట్ చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అంతేకాదు కొందరు సామాన్య జనాలు కూడా పవిత్రకు సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం.

ఇప్పటివరకు ఇండస్ట్రీలో పవిత్ర లాగా రెండో పెళ్లి చేసుకున్న వాళ్లు లేరా..? మరి వాళ్ళని టార్గెట్ చేయకుండా పవిత్రని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. కేవలం ఇండస్ట్రీలో నరేష్ ఒక్కడే నాలుగు పెళ్ళిలు చేసుకున్నారా..? నరేష్ కన్నా ముందు ఎంతో మంది పెద్ద మనుషులుగా ఉండే హీరోలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకొని రాజ్యమేలేసారు.. వాళ్ళ ను టార్గెట్ చేయకుండా కేవలం పవిత్ర నరేష్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం వెనక ఇండస్ట్రీలో ఉండే ఓ ప్రముఖ హీరో హస్తం ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు పవిత్రను కావాలని కించపరచడానికి ఈ విధంగా కొందరు డబ్బులు ఇచ్చి మరి ట్రోల్ చేయిస్తున్నారని ..దీని వెనక ఓ పెద్ద బ్యాచ్ నడుస్తుంది అంటూ కూడా న్యూస్లు వైరల్ అవుతున్నాయి . అయితే నరేష్ అంటే ఎంతో ప్రేమ గల పవిత్ర ఇలాంటి ట్రోలింగ్ లను దిగమింగుతూ.. నరేష్ ను ప్రేమగా చూసుకుంటుంది. ఆడదానిలో ఉండే గొప్పతనం అదే.. భర్త కోసం ..ప్రేమించిన వారి కోసం ఎలాంటి బాధ ను అయిన దిగమింగుతుంది అంటూ కొందరు జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news