Moviesఆ హీరోయిన్ తో నటిస్తే.. నీ కెరీయర్ ఖతం..నితిన్ కు వార్నింగ్...

ఆ హీరోయిన్ తో నటిస్తే.. నీ కెరీయర్ ఖతం..నితిన్ కు వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో..!?

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం . ఇది ఓ మాయలోకం . ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు . స్టార్ గా ఉన్న హీరో జీరో గా అవ్వడం.. జీరో గా ఉన్న హీరో స్టార్ గా మారడం.. రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటాయి .అలా కొన్ని రాత్రులు నిద్ర లేకుండా శ్రమించిన హీరోల తలరాత రాత్రికి రాత్రికి మారిపోయిన సంధర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే లిస్టులోకి వస్తాడు టాలీవుడ్ హీరో నితిన్ .

జయం సినిమాతో హీరోగా తన కెరియర్ను స్టార్ట్ చేసిన నితిన్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో రాణిస్తూ హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా వరుసగా విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే కెరియర్లో ఒకానొక టైంలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతూ స్టార్ హీరోలకు సైతం కాంపిటీషన్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే కెరీర్ లో కొన్ని తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకున్న కారణంగా బొక్క బోర్ల పడిపోయాడు.

కాగా ప్రెసెంట్ నితిన్.. వెంకీ కుడుముల డైరెక్షన్లో హీరోగా ఆతన.. హీరోయిన్గా రష్మిక మందన ఓ సినిమాని ప్రారంభించారు . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి . కాగా ఈ సినిమాలో మొదటి నుంచి హీరోయిన్ సమంత ని హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారట . అయితే నితిన్ కు ఓ బ్యాచ్ నుండి వార్నింగ్ వచ్చిందని .. తమ సినిమాలో హీరోయిన్ సమంతని పెట్టుకుంటే నీకు కెరియర్ లేకుండా చేస్తామని బెదిరించారని ఓ న్యుస్ వైరల్ అవుతుంది .

ఆ కారణంగానే సమంత అంటే ఎంతో ఇష్టం గౌరవం ఉన్న నితిన్ సినిమాలో పెట్టుకోలేకపోయారని.. లేకపోతే మొదటి నుంచి నితిన్ ఈ సినిమా లో హీరోయిన్ సమంత నే అని ఫిక్స్ అయ్యారట. కేవలం నితిన్ నే కాదు ఇండస్ట్రీలో ఉండే పలువురు బడా హీరోలు కూడా సమంతను తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవద్దు అంటూ ఇన్ డైరెక్ట్ గా పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నారట . ఈ క్రమంలోని ఇప్పటివరకు తెలుగులో సమంత ఖుషి సినిమా తప్పిస్తే సైన్ చేసిన దాఖలాలే లేవు . దీంతో ఈ న్యూస్ పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ చర్చ నడుస్తుంది . సినీ ఇండస్ట్రీలో ఇలాంటి యవ్వారాలు కూడా నడుస్తున్నాయా అంటూ జనాలు మండి పడిపోతున్నారు . మరీ ముఖ్యంగా తెలుగు హీరోలపై ఓ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news