Moviesర‌ష్మిక‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన కృతి… నేష‌నల్ క్ర‌ష్ కెరీర్ ముగిసిన‌ట్టే…!

ర‌ష్మిక‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన కృతి… నేష‌నల్ క్ర‌ష్ కెరీర్ ముగిసిన‌ట్టే…!

సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్లకు సక్సెస్ ఎంత ముఖ్యమో ఆ సక్సెస్‌ను కెరియర్ కు ఉపయోగించుకునేలాగా అడుగులు వేయటం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఘోరంగా ఫెయిల్ అయినట్టే కనిపిస్తోంది. రష్మికకు తెలుగులో తిరుగులేని ఫేమ్ వచ్చేసింది. నాగశౌర్య, నితిన్ లాంటి కుర్ర హీరోలతో ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఒక్కసారిగా స్టార్ హీరోలు ఆమెకు గేట్లు ఎత్తేశారు.

దానికి తోడు ఆమెలో మంచి రొమాంటిక్ యాంగిల్ ఉండడంతో పాటు ఎక్స్‌పోజింగ్ విషయంలో గేట్లు ఎత్తేయడంతో రష్మికకు తిరుగులేకుండా పోయింది. బ్లాక్ బస్టర్ హిట్టు వచ్చాక ఆమె తన సొంత భాష అయిన కన్నడం ఆఫర్లు వదులుకొని ఏకంగా బాలీవుడ్ కి మకాం మార్చేసింది. దీంతో సౌత్‌లో ఆమెకు ఉన్న ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. ప్రస్తుతం ఈ నేషనల్ క్ర‌ష్ కు పుష్ప సినిమా మినహాయిస్తే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.

అటు బాలీవుడ్ లోనూ ఆమె చేసిన మొదటి సినిమా గుడ్ బై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇక రెండో సినిమా మిషన్ మజ్ను ఓటీడీలో రిలీజ్ అయితే దానికి కూడా రెస్పాన్స్ లేదు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఆమె నటిస్తున్న యానిమల్ సినిమాలో ఫోకస్ అంతా రణబీర్ మీదే ఉంది. రష్మికను అక్కడ పట్టించుకునే వాళ్లే లేరు. ఇక కోలీవుడ్లో విజయ్ సరసన వారసుడు సినిమా చేసింది. ఆ సినిమా మొత్తం మీద రష్మిక పాత్రనిడివి 20 నిమిషాలు కూడా లేదు. అసలు ఆ సినిమాలో రష్మిక ఉన్న విషయాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు.

ర‌ష్మిక తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లే పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత కూడా ఆమెకు అవకాశాలు రావడం లేదు. టాలీవుడ్ లో రష్మిక‌కు పోటీగా ఇప్పటికే చాలామంది యంగ్ హీరోయిన్లు వస్తున్నారు. విచిత్రం ఏంటంటే కృతి శెట్టికి వరుస ప్లాప్ సినిమాలు వ‌స్తున్నా కూడా ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అటు శ్రీలీలా దూసుకుపోతోంది. మరోవైపు పూజా హెగ్డే నుంచి ఎలాగూ పోటీ ఉంది.

శ్రీలీల‌కు వరుసగా అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి. ఇక కృతి శెట్టి కూడా నాగచైతన్య పక్కన చేసిన కస్ట‌డీ సినిమా మే 12న విడుదలవుతుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకు చాలా అవకాశాలు వస్తున్నాయి. ర‌ష్మికకు వచ్చే అవకాశాలను చాలా వాటిని కృతిశెట్టి లాగేసుకుంటున్నారు. ఏదేమైనా రష్మిక మందన్న కెరీర్ అయితే టాలీవుడ్ లో డేంజర్ లో పడినట్టే కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news