Moviesఅక్క‌డ సిగ‌రెట్ తాగుతూ అడ్డంగా దొరికేసిన స్టార్ హీరోయిన్‌...!

అక్క‌డ సిగ‌రెట్ తాగుతూ అడ్డంగా దొరికేసిన స్టార్ హీరోయిన్‌…!

హీరోయిన్లు సిగరెట్ తాగుతారా ? మందు కొడతారా ? వాళ్ల‌కు ఇంకేమైనా అలవాట్లు ఉంటాయా ఇలాంటి ప్రశ్నలు సహజంగానే వస్తూ ఉంటాయి. చాలామంది హీరోయిన్లు చాటుమాటుగా ఇలాంటి పనులు అన్నీ చేస్తూ ఉంటారు. ఈ తరం హీరోయిన్లు సిగరెట్టు తాగటం.. మందు కొట్టడం.. ఎఫైర్లు పెట్టుకోవటం చాలా కామన్ గా నడుస్తోంది. అయితే ఇలాంటి విషయాల్లో చాలామంది అంత త్వరగా బయటపడరు. ఇప్పుడిప్పుడే కొంతమంది హీరోయిన్లు ఓపెన్ గా తమ బ్రాండ్ ఏంటో చెబుతున్నారు. తమ దురలవాట్లను బయట పెట్టుకుంటున్నారు.

పైకి అమాయంగా కనిపిస్తూనే తెరవెనక రచ్చ చేసే హీరోయిన్ల గురించి.. వారి దురలవాట్లను గురించి తెలిసినప్పుడు ఆడిగినా షాక్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సిగరెట్ తాగుతూ మీడియా కెమెరాలుకు అడ్డంగా దొరికిపోయింది. విజయ్ దేవరకొండ లైగ‌ర్ సినిమాలో నటించిన అనన్య సిగరెట్ తాగే అమ్మాయి అంటూ గతంలో కొన్ని బాలీవుడ్ మీడియాలలో వార్తలు వచ్చాయి. అయితే వాటిని గాసిప్స్ గా కొందరు కొట్టి పడేశారు. ఇప్పుడు అవి నిజమే అని తెలింది. అనన్య పండే ఫస్ట్ టైం సిగరెట్ తాగుతూ కెమెరాకు అడ్డంగా బుక్ అయిపోయింది.

అనన్య తన కజిన్ అలనా పాండే మెహందీ ఫంక్షన్‌కు హాజరయ్యింది. ఈ ఫంక్షన్ కోసం ఆమె చాలా బాగా ముస్తాబయి వచ్చింది. కారు దిగి మీడియా కెమెరాలు ఫోజులు ఇచ్చిన వెంటనే లోపలికి వెళ్ళి సిగరెట్ తీసి వెలిగించింది. ఆమె సిగరెట్ తాగుతున్నప్పుడు ఫంక్షన్లో ఉన్న ఒక వ్యక్తి మొబైల్ లో ఫోటో తీసి సోషల్ మీడియాలో వదిలేశాడు. అలా సోషల్ మీడియాలో పెట్టిన కొద్దిసేపటికి డిలీట్ చేశాడు. అయితే అప్పటికే చాలామంది ఆ స్క్రీన్ షాట్ వైరల్ చేసేసారు.

దీంతో అనన్య ధూమపానంపై సోషల్ మీడియాలో ఇప్పుడు గుప్పు గుప్పుగా చర్చ నడుస్తోంది. అనన్య స్మోకర్ అవుతుందని తాము అస్సలు ఊహించలేదంటూ ఆమె అభిమానులు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె చాలా స్టైల్గా సిగరెట్ తాగుతుందంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా హీరోయిన్లు సిగరెట్లు తాగటం రొటిన్ అని.. అందులో బాలీవుడ్ హీరోయిన్లు సిగరెట్లు తాగడంతో పాటు మందు కూడా కొడుతూ ఉంటారని చాలామంది నెటిజ‌న్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news