Movies" మీ కోసం ఖచ్చితంగా అలా చేస్తా"..ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్...

” మీ కోసం ఖచ్చితంగా అలా చేస్తా”..ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ చెప్పిన ఎన్టీఆర్..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డ్ అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ పేరును ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. కాగా రీసెంట్ గానే మల్టీ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ తదుపరి నటిస్తున్న సినిమా “ధమ్‌కి”. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు గాను ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .

ఈ క్రమంలోని ఎన్టీఆర్ మాట్లాడుతూ..” విశ్వక్సేను ఓ రేంజ్ లో పొగిడేసారు. నేను టెన్షన్ లో ఉన్న ప్రతి సారి కొన్ని చిత్రాలను పదేపదే చూస్తాను.. వాటిల్లో ఒకటే ఈ నగరానికి ఏమైంది కూడా.. ఈ సినిమాల్లో విశ్వక్సేన్ నటన చాలా బాగుంటుంది . ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ చూసాను..చాలా చక్కగా నటించాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకోవడం చాలా గొప్పగా ఉంటుంది”.

“విశ్వక్ సేన్ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశాడు . నేను కూడా ఒకానొక ఛట్రం లో ఇరుక్కుపోయాను. నేను ఎందుకు ఇలాంటి సినిమాలు చూస్తున్నాను .. కొత్త కొత్త చిత్రాలకు కొత్త కాన్సెప్ట్ లకు అవకాశం ఇవ్వాలి అని అనుకోని ఫాన్స్ కోసం అలాంటి చిత్రాలు చేస్తానని నాకు నేనే వాగ్దానం చేసుకున్న రోజు మళ్ళీ పుట్టాను” అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. అంతేకాదు ఆయన ఆస్కార్ అవార్డు అందుకోవడం పట్ల కూడా మాట్లాడారు . “ఇది టీం ఒక్క విజయమే కాదని.. ప్రతి ఇండియన్ అందుకున్న అరుదైన పురస్కారం “అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news