Moviesమెగా ఫ్యామిలీలో మరో గుడ్ న్యూస్.. బ్యాక్ టు బ్యాక్ అన్ని...

మెగా ఫ్యామిలీలో మరో గుడ్ న్యూస్.. బ్యాక్ టు బ్యాక్ అన్ని శుభకార్యాలే..!?

ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ టాప్ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు . మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ వినబోతున్నామా..? అంటే అవును అంటున్నారు అభిమానులు . మనకు తెలిసిందే మెగా కోడలు పిల్ల ఉపాసన ప్రెగ్నెంట్ . గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చేసిన క్షణాలని అభిమానులకు అందజేసింది ఉపాసన. ఈ విషయాన్ని అఫీషియల్ గా మెగాస్టార్ చిరంజీవిని ఓపెన్ అప్ అయ్యి చెప్పాడు .

ఆ తర్వాత పలు ఈవెంట్స్ లో చరణ్ – ఉపాసన సందడి చేసి రచ్చ రచ్చ చేశారు . ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి వారసుడు పుట్టబోతున్నాడు అంటూ మెగా అభిమానులు ఓ రేంజ్ లో సంబరాలు జరుపుకుంటున్నారు . అంతేనా ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు వరించింది. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ ఆనందం డబుల్ అయింది . ఆస్కార్ ఈవెంట్లో రామ్ చరణ్ ఉపాసన పిక్స్ ఏ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారో మెగా అభిమానులు మనకు తెలిసిందే .

కాగా త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో శుభకార్యం జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ ఉపాసనకు ఆరోనెల.. 7 నెల పెట్టగానే ఉపాసనకు శ్రీమంతం చేయడానికి మెగా ఫ్యామిలీ సిద్ధపడిందట . అంతేకాదు ఇండస్ట్రీలోని ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా కనీ విని ఎరుగని రేంజ్ లో మెగా కోడలు ఉపాసన శ్రీమంతం చేయబోతున్నారని ..ఫ్యాన్స్ కి సైతం స్పెషల్ గా ఓ ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది . ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలో ఇలాంటి శుభకార్యం జరగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇదివరకే ఉపాసనకు ఫ్రెండ్స్ శ్రీమంతం జరిపించారు .మళ్లీ మరోసారి మెగా ఫ్యామిలీలో ఇలాంటి శుభకార్యం జరగడం ఫాన్స్ కు కొత్త బూస్టప్ ఇస్తుందనే చెప్పాలి. చూడాలి మరి ఉపాసనకి పాప పుడుతుందో..? బాబు పుడతాడో..?

Latest news