Moviesచిరంజీవి Vs బాల‌కృష్ణ‌… మ‌హేష్‌బాబు Vs ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇదిరా అస‌లు...

చిరంజీవి Vs బాల‌కృష్ణ‌… మ‌హేష్‌బాబు Vs ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇదిరా అస‌లు మ‌జా…!

టాలీవుడ్ లో సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వేదికగా యుద్ధం మామూలుగా ఉండదు. ఒకేసారి ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అయితే అసలు టాలీవుడ్ షేక్ అయిపోతుంది,. థియేటర్లు హోరెత్తిపోతాయి. చిరంజీవి, బాలయ్య అభిమానుల హంగామా అయితే మామూలుగా ఉండదు. 2017 సంక్రాంతి కానుకగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమ కెరీర్ లోనే ప్రతిష్టాత్మకమైన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అయి రెండు సూపర్ హిట్ అయ్యాయి

అలాగే ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలు పోటీపడి రెండు సక్సెస్ అయ్యాయి. ఒకేసారి ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర మజా మామూలుగా ఉండదు. అస‌లు చిరు, బాల‌య్య ఫ్యాన్స్ హంగామా అయితే పెద్ద పండ‌గ‌లా ఉంటుంది. అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకేసారి పోటీ ప‌డితే బాక్సాఫీస్ ఏ రేంజ్ లో హీటెక్కిపోతుందో చెప్పక్కర్లేదు.

అలాంటి అద్భుతమైన మజా వచ్చే సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులకు దక్కనుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతుంది. మహేష్ బాబు – మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే సినిమా షూటింగ్ ఇప్పటికే ఆలస్యం కావడంతో వచ్చే సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్నా ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా కూడా సంక్రాంతి ఖాయం చేసుకున్నట్టు టాలీవుడ్ లేటెస్ట్ బజ్‌. అదే జరిగితే సూపర్ స్టార్, పవర్ స్టార్ సినిమాల మధ్య 2024 సంక్రాంతికి బాక్సాఫీస్ బ్లాస్ట్ తప్పదని సినీవర్గాలు అంటున్నాయి. ఈ ఇంట్ర‌స్టింగ్ పోరులో ఏ స్టార్ హీరో సినిమా పై చేయి సాధిస్తుంద‌న్న‌ది ఇప్ప‌టి నుంచి ఉత్కంఠ‌గానే ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news