Moviesమనోజ్ పరువు గంగలో కలిసిపాయే.. టైం చూసి కోట్టిన మోహన్ బాబు..ఎలా...

మనోజ్ పరువు గంగలో కలిసిపాయే.. టైం చూసి కోట్టిన మోహన్ బాబు..ఎలా తట్టుకుంటాడో పిల్లాడు..?

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ అబ్బాయిల పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనందరికీ బాగా తెలిసిందే. ఏకంగా మంచు మనోజ్ ఇంటికి మంచు విష్ణు దాడికి దిగాడు అంటూ వీడియోతో సహా బయట పెట్టేసాడు మనోజ్. ఈ వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఇప్పటికీ వీళ్ళ మధ్య లో లోపల ఏదో ఇన్నర్ ఫైటింగ్ జరుగుతుందని.. ఆ కారణంగానే మోహన్ బాబు ఈ ఇష్యూ లో సైలెంట్ అయిపోయారు అంటూ కొందరు జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో సగానికి పైగా పోయిన మంచు ఫ్యామిలీ పరువును కాస్త పోగొట్టే విధంగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో మోహన్ బాబు మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వీడియోలో మోహన్ బాబు తన సపోర్టు విష్ణుకే అని మనోజ్ కాదు అంటూ చెప్పేశాడు .

టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ జరిగిన విషయం తెలిసిందే . అప్పట్లో విష్ణు మనోజ్ వేరు వేరు టీమ్స్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే మంచి విష్ణు టీం చాలా కష్టపడి బాగా ఆడింది .. మనోజ్ టీం అంత ఎఫర్ట్స్ పెట్టలేకపోయింది . ఇదే విషయాన్ని అక్కడ ఓపెన్ గా చెప్పి షాక్ ఇచ్చాడు మోహన్ బాబు.

” నేను ఎప్పుడు న్యాయం వైపే నిలబడతాను ..ఎవరి సైడ్ ధర్మం ఉంటే వారిని సపోర్ట్ చేస్తాను.. నిజంగా ఇక్కడ కష్టపడి ఆడింది విష్ణు టీం అందుకే వాళ్ల కి సపోర్ట్ చేస్తున్నాను ..మనోజ్ టీం కాదు అంటూ ఓపెన్ గా చెప్పుకోచ్చారు. ప్రెసెంట్ ఇదే వీడియోని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కొందరు మంచు ఫ్యామిలీ హేటర్స్. దీంతో మరోసారి మంచు ఫ్యామిలీ లోని గొడవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు మనోజ్ ని కావాలనే ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news