Moviesఎన్టీఆర్‌ తన భార్య ప్రణతిని ముద్దుగా ఏమని పిలిస్తారో తెలుసా..?...

ఎన్టీఆర్‌ తన భార్య ప్రణతిని ముద్దుగా ఏమని పిలిస్తారో తెలుసా..? నిజమైన ప్రేమ అంటే ఇదేగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది క్యూట్ కపుల్స్ ఉన్న వాళ్ళందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. ఆయన భార్య లక్ష్మి ప్రణతి . ప్రజెంట్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా కట్యాగ్ చేయించుకొని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన లాస్ట్ గా నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అవార్డు అందుకోవడంతో ఇంతటి ఘనత సాధించాడు ఎన్టీఆర్ .

కాగా ఇప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతుంది . కాగా ఇదే క్రమంలో రీసెంట్గా ఆయన భార్య పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన పోస్ట్ గ్లోబల్ స్థాయిలో హాట్ టాపిక్ ఆ ట్రెండ్ అవ్వడం నందమూరి ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషిని ఇస్తుంది . 2011లో ఎన్టీఆర్.. లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే . వీళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు . అభయ్ రామ్, భార్గవ్ రామ్.

నేడు తారక్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పైన ఉన్న ప్రేమను అభిమానులకు తెలియజేశాడు. అంతేకాదు ఇదే క్రమంలో ఆయన ముద్దుగా భార్యను ఏమని పిలుస్తాడో అనే విషయం కూడా బయట పెట్టేశాడు. తన భార్య లక్ష్మీప్రణతి ని పుట్టినరోజు సందర్భంగా “హ్యాపీ బర్త్డే అమ్ములు ” అంటూ చాలా ప్రేమగా విషెస్ తెలియజేశారు .

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన భార్యను ఎంత ప్రేమిస్తున్నాడో.. ఎంత బాగా చూసుకుంటాడో అన్న విషయం బయట పడిపోయింది . అంతేకాదు నిజమైన ప్రేమకు అర్థం ఇదే కదా అందరిలా బరితెగించిన ఫొటోస్ షేర్ చేయకుండా చాలా పద్ధతిగా లక్ష్మీ ప్రణతి ఎంతో హ్యాపీగా ఉన్న ఫోటోను షేర్ చేసి తన భార్యపై ఉన్న ప్రేమను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆ పోస్ట్ ని ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు వదినమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా విష్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news