Moviesఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా బాల‌య్య బాబుకే కాజ‌ల్ ఎందుకు ఓకే చెప్పిందో...

ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా బాల‌య్య బాబుకే కాజ‌ల్ ఎందుకు ఓకే చెప్పిందో తెలుసా… ఏం ప్లాన్ వేసిందిలే..!!

కాజల్ అగర్వాల్ 10 ఏళ్లకు పైగా టాలీవుడ్ ను ఏలేసింది. అటు సీనియర్ హీరోలతో పాటు జూనియర్ హీరోలకు జోడిగా నటించి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టేసింది. ముఖ్యంగా మెరుపు కళ్ళ అందంతో కాజల్ ప్రేక్షకులను బాగా ఆకర్షించేది. కరోనా టైంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతం కిచ్చులను పెళ్లి చేసుకున్న కాజల్ ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రైసింగ్ కోసం చాలా ఆరాటపడుతుంది.

బిడ్డ పుట్టాక ఆమె చేసిన తమిళ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే కాజల్ కు ఇది పెద్ద ఊహించిన షాక్ అని చెప్పాలి. పెళ్లి సమయంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాకు ఓకే చెప్పింది. అంతకుముందే చిరుత, ఖైదీ నెంబర్ 150 సినిమాతో తండ్రి, కొడుకులతో సినిమా చేసింది. ఆచార్య సినిమా నుంచి కొన్ని కారణాల వల్ల ఆమెను మధ్యలోనే తప్పించారు.

ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా ఆఫర్లు వస్తున్న ఆమె మాత్రం కావాలని నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమాకు మాత్రమే ఓకే చెప్పింది. చాలా అవకాశాలు వస్తున్నాయి బాలయ్య సినిమాకు మాత్రమే కాజల్ ఎందుకు ఓకే చెప్పింది. అన్నదానిపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చే నడుస్తోంది. కాజల్ మామూలుది కాదని చాలా చాలా ఆలోచనలు స్కెచ్ లు వేస్తుందని. ఆమె గురించి ఇండస్ట్రీలో బాగా తెలిసిన వారు చెబుతూ ఉంటారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ నటిస్తుందని తెలియగానే వెంకటేష్ లాంటి ఒకరిద్దరు హీరోల సినిమాలలో కూడా ఆమెకు ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె మాత్రం బాలయ్యకే ఓటు వేసింది. ఇది నిజంగా ఆమెకు ఒక గ్రేట్ కమ్ బ్యాక్ అనుకోవాలి. ప్రస్తుతం బాలయ్య మామూలు ఫామ్ లో లేడు. అఖండ, వీరసింహారెడ్డి, అన్ స్టాపబుల్ ఇలా ఎక్కడ చూసినా బాలయ్య హంగామా కనిపిస్తోంది.

ఇలాంటి టైంలో బాలయ్యతో ఒక్క సినిమా పడితే చాలు తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని మళ్లీ కొన్నాళ్లపాటు తనకు తిరుగు ఉండదని కాజల్ డిసైడ్ అయినట్టు ఉంది. బాలయ్య గోల్డెన్ హ్యాండ్ తనకు బిగ్ బూస్ట్ గా మారుతుందని ఆమె ఆశిస్తోంది. ఇక అనిల్ రావిపూడి అసలు ఓటమి తెలియని డైరెక్టర్ గా ఉన్నాడు. ఇలాంటి గొప్ప కాంబినేషన్లో నటిస్తేనే తనకు సరైన కమ్ బ్యాక్ దక్కినట్టు అవుతుందన్నదే కాజల్ స్కెచ్ గా తెలుస్తోంది. మరి కాజల్ ఆశలను బాలయ్య అదృష్టం ఏ స్థాయికి తీసుకు వెళుతుందో చూడాలి…?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news