Moviesతాగి వ‌చ్చి ఆ హీరోయిన్ ప‌క్క‌న పడుకుంటాన‌న్న టాలీవుడ్ స్టార్ హీరో.....

తాగి వ‌చ్చి ఆ హీరోయిన్ ప‌క్క‌న పడుకుంటాన‌న్న టాలీవుడ్ స్టార్ హీరో.. లాస్ట్ ట్విస్ట్ సూపరో సూపర్..!!

టాలీవుడ్ లో హీరోయిన్లపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనలు ఎంత సంచలనంగా మారయో తెలిసిందే. ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ పేరుతో సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై ప్రతి ఒక్కరూ ధైర్యంగా నోరు విప్పుతున్నారు. మీ టు పేరుతో జరిగిన ఉద్యమం తర్వాత ఇండస్ట్రీలో మహిళలపై చాలావరకు వేధింపులు తగ్గుతున్నాయి అని చెప్పాలి. అయితే మహిళలపై ఈ లైంగిక వేధింపులు అనేవి ఇప్పటినుంచే కాదు గత కొన్ని దశాబ్దాలు నుంచి కూడా ఉన్నవే.

అయితే అప్పట్లో ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా లేదు. అందుకే చాలామంది హీరోయిన్లు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పకోలేని పరిస్థితి. అప్పట్లో హీరోయిన్లు ఎవరైనా ఇలాంటి వేధింపులు పై నోరు ఎత్తితే వాళ్లకు అవకాశాలు లేకుండా చేసి ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేసేవారు. అప్పట్లో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉండేది. హీరోయిన్ల మాటలకు అప్పట్లో అంతా ప్రాధాన్యత ఉండేదే కాదు. అయితే కొందరు సీనియర్ హీరోయిన్లు ఇప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో అప్పట్లో తమ ఎదుర్కొన్న వేధింపుల గురించి ఓపెన్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ కూడా.. వెన్నెరాడై నిర్మల ఒక టాలీవుడ్ స్టార్ హీరో వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారో వివరించారు. తెలుగులో ఆమె శంకర్ దాదా ఎంబిబిఎస్, జయం మనదేరా, భక్త ప్రహ్లాద, కరుణామయుడు, శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా లాంటి సినిమాలలో నటించారు.

ఆమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి అయితే ఒక సినిమా షూటింగ్ చేసే సమయంలో ఒక పెద్ద హీరో షూటింగ్ అయిపోయాక ఫుల్లుగా తాగేసి ఆమె ఇంటికి వెళ్ళాడట. డోర్ కొడుతూ తలుపు తీయమని చాలా సేపు అడిగాడట. నేను మిమ్మల్ని ఏమీ చేయను మీ పక్కన పడుకుని వెళ్ళిపోతా అంటూ నానా రకాలుగా మాట్లాడాడట. వెంటనే ఆమెకు భయమేసి చాలాసేపటి వరకు డోర్లు తీయలేదట. కొంత సేపు ఉన్న ఆ హీరో తిరిగి వెళ్ళిపోయాడట.

అయితే తాను ఆ సినిమా నుంచి తప్పుకుంటానని చెప్పడంతో దర్శకులు నిర్మాత వచ్చి తనను బతిమిలాడారని అయినా కూడా చేయనని చెప్పేశాను ఆ సంఘటన తనను చాలా కలిచి వేసిందని కూడా నిర్మల పేర్కొన్నారు. అయితే ఆ హీరో ఎవరనేది పేరు మాత్రం చెప్పలేనని నిర్మల చెప్పారు. నిర్మల లాంటి సీనియర్ హీరోయిన్కే ఇలాంటి వేధింపులు తప్ప లేదంటే కాస్టింగ్ అప్పట్లో కూడా ఏ స్థాయిలో ఉండేదో అర్థమవుతుందన్న చర్చలు ఇప్పుడు నడుస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news