Moviesసింధు తులాని భర్త అంత తోపా.. నెలకు ఎంత సంపాదిస్తాడొ తెలిస్తే...

సింధు తులాని భర్త అంత తోపా.. నెలకు ఎంత సంపాదిస్తాడొ తెలిస్తే మైండ్ బ్లాకే.. అదృష్టాని జాకెట్ లో పెట్టుకునేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోదామని ఎంతోమంది ముద్దుగుమ్మలు ఆశపడి ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు . అయితే అందరికీ ఆ అవకాశం దక్కదు . ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చి.. హీరోయిన్గా మారలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . ఆ జాబితాలోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ సింధు తులాని. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తెలుగు ప్రేక్షకులకు ఈ భామ సుపరిచితురాలు. ముంబైలో జన్మించిన సింధు 2003లో చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో తెరకెక్కిన “ఐతే” అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ అయింది .

ఆ తర్వాత నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అతనొక్కడే సినిమాలో హీరోయిన్గా నటించి .. అందరి అటెన్షను గ్రాబ్ చేసింది . ఈ సినిమాలో సింధు తులాని నటన సూపర్ గా ఉంది అంటూ స్టార్స్ కూడా ఓపెన్ గా చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి, పౌర్ణమి ,పోతే పోనీ ,బతుకమ్మ ,హరే రామ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఎందుకో తెలియదు కానీ అమ్మడుకు సడన్గా ఆఫర్లు ఆగిపోయాయి .

ఈ క్రమంలోనే మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా చేసింది . టోటల్గా తమిళ్ , కన్నడ , హిందీ భాషలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ ముద్దుగుమ్మ . ఈ క్రమంలోనే అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అక్కడ కూడా నటనను ప్రూవ్ చేసుకుని తెలుగులో కిక్ , ప్రేమ కావాలి , ఇష్క్ వంటి చిత్రాలలో తనదైన స్టైల్ లో నటించి మంచి మార్కులు వేయించుకుంది . అంతేకాదు అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా ఆయనకు వదిన పాత్రలో నటించి కనిపించి మెప్పించింది . కాగా ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన సింధుతులాని చేతన్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది .

సింధుతులాని భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు అని తెలుస్తుంది. అంతేకాదు నెలకు లక్షల్లోనే జీతం. సొంత బంగ్లా కూడా ఉందట. ఆస్తులు కూడా బాగానే ఉన్నాయట. వీరికి ఓ పాప కూడా ఉంది . పేరు శ్వేత. ప్రెజెంట్ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news