Moviesపొట్టిదానా… కాదు నువ్వే పొట్టిదానివి.. సెట్లోనే తిట్టుకున్న జ‌య‌సుధ‌.. ఆ స్టార్...

పొట్టిదానా… కాదు నువ్వే పొట్టిదానివి.. సెట్లోనే తిట్టుకున్న జ‌య‌సుధ‌.. ఆ స్టార్ హీరోయిన్‌…!

సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్ల మధ్య గొడవలు, పంతాలు, ఇగోలు ఇవన్నీ సర్వసాధారణం. ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే వారిద్దరి క్యారెక్టర్ లను బ్యాలెన్స్‌ చేయటం దర్శకుడికి కత్తి మీద సామూలాంటిదే. అదే ఇద్దరు స్టార్ హీరోయిన్లు… ఒకే క్రేజ్ ఉన్న హీరోయిన్లు అయితే చాలా కష్టం. అసలు త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలో ఎన్టీఆర్ రామ్ – చరణ్ ఇమేజ్ లను రాజమౌళి చాలా సమానంగా బ్యాలెన్స్ చేస్తూ కథ నడిపించాడు. ఈ ఇద్దరి పాత్రలలో ఒకరి పాత్ర ఎక్కువ.. ఒకరు పాత్ర తక్కువ అయితే అసలు ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎంత పెద్ద యుద్ధం ? జరిగేదో ఊహించుకోవడమే కష్టంగా ఉంది.

అలా ఇద్దరు స్టార్ హీరోలు లేదా.. హీరోయిన్లు కలిసి నటిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు దేవత సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు జయప్రద, శ్రీదేవి మధ్య మాటలు లేవు వారిద్దరిని కలిపి సినిమా తీయడం రాఘవేంద్రరావుకి పెద్ద సవాల్ గా మారింది. అయితే ఆయన సీనియర్ దర్శకుడు కావడంతో ఇద్దరు షూటింగ్ సెట్లో మాట్లాడుకోకపోయినా.. చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఆ సినిమాను తెరకెక్కించారు. శ్రీదేవి సెట్లోకి వస్తే జయప్రద పక్కకు వెళ్ళిపోయేవారట. అలాగే జయప్రద సెట్లోకి వస్తే శ్రీదేవి అక్కడ ఉండేందుకు ఇష్టపడేవారు కాదట. ఇంత పెద్ద వార్ వారి మధ్య ఉండేది.

అలాగే కృష్ణంరాజు హీరోగా వచ్చిన కటకటాల రుద్రయ్య సినిమా షూటింగ్ సమయంలో అప్పటి స్టార్ హీరోయిన్లు జయసుధ, జయచిత్ర మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకుడు. జయసుధ అప్పటికే వడ్డే రమేష్ దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా ఉన్న కాకర్ల రాజేంద్రప్రసాద్ తో ప్రేమలో పడింది. రాజేంద్రప్రసాద్ – జయసుధ కోసం మంచి మంచి కాస్ట్యూమ్స్ తో పాటు స్లిప్పర్లు మంచి అలంకరణ సామాగ్రి తెప్పించారట.

జ‌యచిత్రకు మాత్రం చాలా సాధారణ కాస్ట్యూమ్స్ ఇచ్చారట. ఇది జ‌య‌చిత్ర‌కు బాగా కోపం తెప్పించింది. ఇదే అదునుగా జయచిత్ర‌.. రాజేంద్రప్రసాద్ – జ‌య‌సుధ మధ్య ఉన్న ప్రేమను కూడా లీక్‌ చేసేసింది అట. దాసరికి సార్ కావాలనే రాజేంద్రప్రసాద్ ఆమెపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు… నాకు ఎందుకు ? ఇలా తక్కువ రకం కాస్ట్యూమ్స్ ఇచ్చారు అని నేరుగానే ప్రశ్నించడంతో జయసుధకు పట్టరాని కోపం వచ్చేసింది అట. ఆ తర్వాత జయచిత్ర, జయసుధ ఇద్దరు షూటింగ్లోనే ఒకరిపై ఒకరు మాటలు విసురుకున్నారు.

నువ్వు పొట్టి దానివే అని జయసుధను అంటే.. ఆమె కూడా వెంటనే నువ్వు చెప్పులు తీసేయవే నువ్వు కూడా పొట్టి దానివే అంటూ జయచిత్రపై ఫైర్ అయిందట. అలా వారిద్దరి మధ్య అప్పట్లో పెద్ద మాటలు యుద్ధం జరిగింది. చివరకు దాసరి జోక్యం చేసుకొని వీరి గొడవను పరిష్కరించారు. అయితే ఆ తర్వాత కూడా వారిద్దరూ ఆ సంఘటన మనసులో పెట్టుకుని పెద్దగా మాట్లాడుకోరని ఇండస్ట్రీలో టాక్ నడిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news