Moviesఅస్స‌లు గుర్తు ప‌ట్ట‌కుండా మారిపోయిన సీనియ‌ర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా…!

అస్స‌లు గుర్తు ప‌ట్ట‌కుండా మారిపోయిన సీనియ‌ర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా…!

బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ సినిమాల్లో నటించడం.. ఇప్పటినుంచే కాదు గత కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తోంది. ఇప్పుడైతే తెలుగు సినిమాలకు హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంది. మొత్తం బాలీవుడ్ హీరోయిన్లనే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ఒకప్పుడు తెలుగులో హీరోయిన్లు ఎక్కువమంది ఉండేవారు. దీంతో బాలీవుడ్ హీరోయిన్లకు చాలా తక్కువగా ఛాన్సులు వచ్చేవి. బాలీవుడ్ లో చాలా తక్కువ టైంలోనే సూపర్ పాపులర్ అయిన హీరోయిన్లలో మీనాక్షి శేషాద్రి ఒకరు.

మీనాక్షి శేషాద్రి అసలు పేరు శశికళ శేషాద్రి. ఆమె ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రం ( అప్పట్లో బీహార్ లోని ) ధన్‌బాద్‌కు సమీపంలో ఉన్న సింద్రీలో పుట్టింది. ఆమె విద్యాభ్యాసం ధన్బాద్లోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో జరిగింది. శశికళ తండ్రి సింద్రీ ఎరువుల కర్మాగారంలో ఉద్యోగిగా పనిచేసేవారు. ఆమె 1981 లోనే 18 ఏళ్ల వయసుకే మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. ఆ మరుసటి సంవత్సరం 1982లో ప్రముఖ హీరో మనోజ్ కుమార్ కొడుకు రాజీవ్ గోస్వామి సరసన పెయింటర్ బాబు సినిమాతో బాలీవుడ్లోకి హీరోయిన్గా ఇంటర్ ఇచ్చింది.

1983లో ప్రముఖ దర్శకుడు సుభాష్ గై బ్లాక్ బస్టర్ హిట్ హీరో సినిమాతో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత తెలుగులో ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించింది. 1991లో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్, బాలకృష్ణ, మీనాక్షి శేషాద్రి, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాతో మీనాక్షి తెలుగులో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఆమె తెలుగులో జీవన పోరాటం అనే సినిమా కూడా చేసింది.

ఇక చివరిగా కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద‌ నాగేశ్వరరావు నిర్మించిన ఆపద్బాంధవుడు సినిమాలో కూడా ఆమె హీరోయిన్. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. అయిన‌ టాలీవుడ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ సినిమాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఆ సినిమాలో మీనాక్షి ఎక్స్‌ప్రెష‌న్స్ అదుర్స్‌.
మీనాక్షి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా బాలీవుడ్ లో మాత్రం ఆమె నెంబర్ వన్ హీరోయిన్గా ఎదిగింది. సినిమాలుకు గుడ్ బై చెప్పేశాక ఆమె 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది.

ప్రస్తుతం ఆమె అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ నడుపుతూ బిజీ బిజీగా జీవితం గడుపుతుంది. మీనాక్షికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే అసలు ఆమె ఎన్టీఆర్.. చిరంజీవితో చేసిన మీనాక్షి శేషాద్రి యేనా ? అన్న సందేహాలు రాక మానవు. అలా మారిపోయింది ఆమె రూపం.. ఈ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్కువేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news