Moviesపాపం చిరంజీవి కూతురు సుస్మిత‌… ఇన్ని క‌ష్టాలా…!

పాపం చిరంజీవి కూతురు సుస్మిత‌… ఇన్ని క‌ష్టాలా…!

ప్రస్తుతం ఇదే మాట అనుకోవాలి… ఎందుకో కానీ ? చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితకు ఎప్పుడు కాలం కలిసి రావడం లేదు. ఆమెకు ముందుగా అప్పట్లో క్రేజీ హీరోగా ఉన్న ఉదయ్ కిరణ్తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక పెళ్లి జరుగుతుంది అనుకునే టైంలో ఎక్కడ తేడా కొట్టిందో కానీ క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ స్టార్‌డం ఒక్కసారిగా పడిపోయింది. దీంతో అనవసరంగా చిరంజీవి సుస్మితను బయట పెట్టారని చర్చ అప్పట్లో నడిచింది. ఆ తర్వాత ఆమెను చెన్నైకి చెందిన ఒక పారిశ్రామికవేత్తల కుటుంబానికి కోడలిగా పంపారు. ఏం జరిగిందో తెలియదు గానీ చాలా ఏళ్ల నుంచి సుస్మిత హైదరాబాదులోనే ఉంటుంది.

చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది సుస్మిత‌. ఖైదీ నెంబర్ 150, సైరా, వాల్తేరు వీర‌య్య‌ సినిమాలకు ఆమె చేసిన వర్క్ బాగుంది అన్న ప్రశంసలు అయితే దక్కాయి. ఇక సుస్మితకు ముందు నుంచి ఏదో ఒకటి చేసి తానేంటో ప్రూవ్ చేసుకోవాలన్న కోరిక బలంగా ఉంది. అందుకే నిర్మాతగా మారింది.. తన బ్యానర్ పై ముందుగా ఒక వెబ్ సిరీస్ తీశారు.. అది ఆశించినంతగా వర్కౌట్ కాలేదు.

రీసెంట్గా సంతోష్ శోభన్ తో ఒక చిన్న సినిమా తీశారు. చిరంజీవి లాంటి పెద్ద హీరో కుమార్తె అయి ఉండి కూడా.. తాను తీసిన సినిమాను రిలీజ్ చేయడానికి మార్కెట్ చేసుకోవడానికి ఆమె చాలా చాలా ఇబ్బందులు పడింది. ఎంత చిరంజీవి కుమార్తె అయిన టాలీవుడ్ లో సినిమా రిలీజ్ చేయాలంటే ఎలాంటి ఇబ్బందికర పరిస్తితిలు ఉన్నాయో.. మార్కెట్లో ఉన్న జనాలకు బాగా తెలుసు. సుస్మితకు కూడా ఆ తరహా ఇబ్బందులు తప్పలేదు.

అసలు వెబ్ సిరీస్, సినిమా విషయంలో చిరంజీవి కూడా ఆమెకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు కూతురుపై చిరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సుస్మిత నిర్మాతగా చిరంజీవి హీరోగా ఒక సినిమా దాదాపు లాక్ అయ్యే స్టేజ్లో ఉంది. ఈ సినిమాతోనే సుస్మిత తాను స్థాపించిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పెద్ద కంపెనీగా.. పెద్ద బ్యానర్ గా మారుతుందని ఆశిస్తోంది. వాస్తవానికి ఇప్పటికే చిరంజీవికి కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ఉంది.

ఇప్పుడు కుమార్తె సుస్మిత సొంతంగా గోల్డ్ బాగ్స్ ఎంటర్టైన్మెంట్ స్థాపించుకున్నారు. అసలే కష్టాల్లో ఉన్న సుస్మితను తనకు తాను ప్రూవ్ చేసుకునేందుకే.. చిరంజీవి ఆమె బ్యానర్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఓ తమిళ దర్శకుడు లేదా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాతో అయినా సుస్మిత నిర్మాతగా సెటిల్ అవుతుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news